ఎవరైనా పురుషులను చూసినప్పుడు స్త్రీలకు ఫీలింగ్స్ కలగాలంటే అందుకు వారికి సుమారుగా 15 రోజుల సమయం పడుతుందట. కానీ పురుషులకు అయితే స్త్రీలను చూసినప్పుడు ఫీలింగ్స్ కలిగేందుకు కేవలం 8.2 సెకన్ల సమయమే పడుతుందట. స్త్రీలు తమ పట్ల జాలి, దయ చూపించే పురుషులను ఇష్టపడరు. చుట్టూ ఉన్నవారితో ఎలా ఉంటున్నారు.. అనే విషయాన్ని బట్టి కూడా ఇష్టపడుతుంటారు. స్త్రీలను చూసినప్పుడు ఏ పురుషుడిలో అయితే పురుషత్వం ఉట్టి పడుతుందో అలాంటి పురుషులు అంటే స్త్రీలు ఎక్కువగా ఇష్టపడతారట.
ఒక పురుషుడు ఇతరులను ఏ విధంగా ఆకర్షిస్తున్నాడు అనే విషయాన్ని స్త్రీలు చాలా బాగా గుర్తు పెట్టుకుంటారట. దృఢత్వం, ఆరోగ్యం, ధైర్యం వంటి అంశాలు ఎక్కువగా ఉండే పురుషులనే స్త్రీలు ఎక్కువగా ఇష్టపడతారట. ఇతరులతో చాలా సరదాగా సంభాషణలు మొదలు పెట్టే పురుషులు అంటే స్త్రీలకు చాలా ఇష్టమట.
స్త్రీ, పురుషుడు ఇద్దరూ ఒకే వయస్సు వారు అయినప్పటికీ స్త్రీలు ఏ అంశంలో అయినా పరిపూర్ణంగా ఉంటారట. పురుషులు ప్రవర్తించినట్లు స్త్రీలు తమకు ఇష్టం ఉన్నవారి దగ్గర చిన్న పిల్లల్లా ప్రవర్తించరట. తమ వాయిస్‌ను బలంగా వినిపించే పురుషులు అన్నా కూడా స్త్రీలకు ఇష్టమేనట. అలాంటి వారిలో స్త్రీలు ఆత్మవిశ్వాసాన్ని చూస్తారట. కనుక పురుషులు ఈ విషయాలను గుర్తు పెట్టుకుని మసలుకుంటే ఏ స్త్రీ దృష్టిలో అయినా సరే పడిపోతారు.