Ginger And Lemon Water : ఉద‌యం ప‌ర‌గ‌డుపున దీన్ని తాగితే ఎంత‌టి బ‌రువు అయినా త‌గ్గాల్సిందే..!

Ginger And Lemon Water : ఊబ‌కాయం.. ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు మ‌నలో చాలా మంది ఉండే ఉంటారు. ప్ర‌స్తుత కాలంలో ఈ స‌మ‌స్య‌ మ‌న‌లో చాలా మందిని వేధిస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు. ఊబ‌కాయం బారిన ప‌డ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. మారుతున్న మ‌న జీవ‌న శైలి, ఆహార‌పు అల‌వాట్లు, ఎక్కువ సేపు కూర్చొని ప‌ని చేయ‌డం, శ‌రీరానికి త‌గినంత శ్ర‌మ లేక‌పోవ‌డం, మాన‌సిక ఆందోళ‌న వంటి వాటిని ఈ స‌మ‌స్య త‌లెత్త‌డానికి ప్ర‌ధాన కార‌ణాలుగా చెప్ప‌వ‌చ్చు. ఊబ‌కాయం స‌మ‌స్య‌కు కార‌ణాలు తెలిసిన‌ప్ప‌టికి మ‌నం ఏమి చేయ‌లేని పరిస్తితి నెల‌కొంది. ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట ప‌డ‌డానికి అనేక ర‌కాల ప్ర‌య‌త్నాలు చేసి ఏది ఫ‌లించ‌క ఇబ్బంది ప‌డుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంద‌నే చెప్ప‌వ‌చ్చు.

స‌హ‌జ సిద్ద చిట్కాను ఉప‌యోగించి ఈ ఊబ‌కాయం అలాగే అధిక బ‌రువు స‌మ‌స్య నుండి మ‌నం చాలా సుల‌భంగా బయ‌ట ప‌డ‌వ‌చ్చు. మ‌న ఇంట్లో ఉండే ప‌దార్థాల‌తో ఒక పానీయాన్ని త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల ఎంత‌టి బ‌రువైనా మ‌నం చాలా సులువుగా త‌గ్గ‌వ‌చ్చు. ఊబ‌కాయం స‌మ‌స్య‌ను తగ్గించే ఈ చిట్కాను త‌యారు చేసుకోవ‌డానికి కావల్సిన ప‌దార్థాలు ఏమిటి అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. దీని కోసం మ‌నం నిమ్మ‌కాయ‌ల‌ను ఉప‌యోగించాల్సి ఉంటుంది. నిమ్మకాయ‌లో విట‌మిన్ సి తో పాటు సిట్రిక్ యాసిడ్ కూడా పుష్క‌లంగా ఉంటుంది. శ‌రీరంలో జీవ‌క్రియ‌ల రేటును పెంచ‌డంలో, శ‌రీరంలో పేరుకుపోయిన కొవ్వును, వ్య‌ర్థ ప‌దార్థాల‌ను తొల‌గించ‌డంలో, అదేవిధంగా మ‌ల‌బ‌ద్ద‌కం, గ్యాస్ వంటి స‌మ‌స్య‌లను దూరం చేయ‌డంలో, చ‌ర్మాన్ని కాంతివంతంగా త‌యారు చేయ‌డంలో ఈ నిమ్మ‌కాయ‌లు మ‌న‌కు ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయి.

Ginger And Lemon Water drink daily on empty stomach for weight loss
Ginger And Lemon Water

అలాగే ఈ చిట్కాను త‌యారు చేసుకోవ‌డానికి మ‌నం ఉప‌యోగించాల్సిన మ‌రో ప‌దార్థం అల్లం. ఇది మ‌న శ‌రీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. శ‌రీరంలో పేరుకు పోయిన వ్య‌ర్థాల‌ను తొల‌గించ‌డంలో, బ‌రువు త‌గ్గించ‌డంలో, తీసుకున్న ఆహారం స‌క్ర‌మంగా జీర్ణ‌మ‌య్యేలా చేయ‌డంలో, వాంతులు, వికారం వంటి వాటిని త‌గ్గించ‌డంలో ఈ అల్లం మ‌న‌కు దోహ‌ద‌ప‌డుతుంది. అలాగే మ‌నం ఉప‌యోగించాల్సిన మ‌రో ప‌దార్థం తేనె. మ‌న శ‌రీరానికి త‌క్ష‌ణ శక్తిని ఇవ్వ‌డంలో, ర‌క్తాన్ని శుద్ది చేయ‌డంలో, బ‌రువు త‌గ్గ‌డంలో తేనె మ‌న‌కు తోడ్ప‌డుతుంది. ఈ ప‌దార్థాల‌తో చిట్కాను ఎలా త‌యారు చేసుకోవాలి… దీనిని ఎలా తీసుకోవ‌డం వ‌ల్ల ఊబ‌కాయం స‌మ‌స్య నుండి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. దీని కోసం ముందుగా నిమ్మ‌కాయ‌ను గుండ్రంగా ముక్క‌లుగా త‌ర‌గాలి. త‌రువాత రెండు ఇంచుల ముక్క‌ను తీసుకుని శుభ్రం చేసి చిన్న ముక్క‌లుగా త‌ర‌గాలి.

ఇప్పుడు ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని తీసుకుని అందులో నిమ్మ‌కాయ ముక్క‌లను, అల్లం త‌రుగును వేయాలి. త‌రువాత ఈ నీటిని 15 నిమిషాల పాటు చిన్న మంట‌పై మ‌రిగించాలి. ఇలా మ‌రిగించిన త‌రువాత ఈ నీటిని ఒక క‌ప్పులోకి వ‌డ‌క‌ట్టుకుని తీసుకోవాలి. త‌రువాత దీనిలో ఒక టీ స్పూన్ తేనెను వేసి క‌ల‌పాలి. ఇలా త‌యారు చేసుకున్న పానీయాన్ని రోజూ ఉద‌యం ప‌ర‌గ‌డుపున గోరు వెచ్చ‌గా తీసుకోవాలి. దీనిని తీసుకున్న త‌రువాత గంట వ‌ర‌కు ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు. ఈ పానీయాన్ని క్ర‌మం త‌ప్ప‌కుండా రోజూ తీసుకోవ‌డం వ‌ల్ల నెల‌ రోజుల్లోనే మ‌న శ‌రీరంలో వ‌చ్చే మార్పును గ‌మ‌నించ‌వ‌చ్చు. ఈ పానీయాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల ఊబ‌కాయం, అధిక బ‌రువు స‌మ‌స్య నుండి చాలా త్వ‌ర‌గా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఈ పానీయాన్ని తీసుకుంటూ చ‌క్క‌టి జీవ‌న శైలిని పాటించాలి. జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. అధిక బ‌రువు, ఊబ‌కాయం స‌మ‌స్య‌ల‌తో బాధ‌పడే వారు ఈ విధంగా ఈ చిట్కాను పాటించ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు.

Share
D

Recent Posts