బాదంపప్పుల్లో ఎన్నో పోషకాలు ఉంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే. వీటిని నీటిలో నానబెట్టి రోజూ తినడం వల్ల అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. శక్తి, పోషణ లభిస్తాయి. అయితే పెద్దలకే కాదు పిల్లలకూ బాదం పప్పులు ఎంతగానో మేలు చేస్తాయి. వీటిని పిల్లలకు రోజూ ఇవ్వాలి. దీంతో అనేక ప్రయోజనాలను పొందవచ్చు. బాదం పప్పును రోజూ పిల్లలకు తినిపించడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. బాదంపప్పును పిల్లలకు తినిపించడం వల్ల వారిలో మెదడు బాగా వృద్ధి చెందుతుంది. బాదంపప్పులో ఉండే ప్రోటీన్లు మెదడు కణాలను మరమ్మత్తులు చేస్తాయి. ఈ పప్పులో ఉండే విటమిన్ ఇ, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు పిల్లల్లో మెదడు పనితీరును మెరుగు పరుస్తాయి. బాదం పప్పులో మెగ్నిషియం అధికంగా ఉంటుంది. ఇది నాడీ మండల వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. బాదంపప్పును పిల్లలకు రోజూ తినిపించడం వల్ల వారిలో ఐక్యూ లెవల్స్ బాగా పెరుగుతాయని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో వెల్లడైంది. అందువల్ల బాదంపప్పును పిల్లలకు రోజూ తినిపించాలి.
2. పిల్లలు అన్ని విధాలుగా సరిగ్గా ఎదిగేందుకు బాదంపప్పులు తోడ్పడుతాయి. వీటిని తినడం వల్ల చిన్నారుల్లో జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఈ పప్పులో ఉండే విటమిన్ ఇ జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను పెంచుతుంది. దీంతో వారు చదువుల్లో రాణిస్తారు. తెలివితేటలు పెరుగుతాయి.
3. బాదంపప్పును రోజూ పిల్లలకు తినిపించడం వల్ల వారిలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ సీజన్‌లో సహజంగానే వారికి అనేక రకాల వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు వస్తుంటాయి. వాటికి అడ్డుకట్ట వేయాలంటే రోజూ బాదం పప్పు ఇవ్వాలి. ఇక కోవిడ్ నుంచి రక్షణ కూడా లభిస్తుంది. బాదంపప్పును తినడం వల్ల శరీరంలో రక్తం గడ్డకట్టదు. దీని వల్ల ఇన్‌ఫెక్షన్ వ్యాపించే తీవ్రత తగ్గుతుంది. ఆరోగ్యం సురక్షితంగా ఉంటుంది. బాదంపప్పులో ఉండే ప్రోటీన్లు, ఐరన్ పిల్లలకు బలాన్నిస్తాయి. వారిలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
4. రోజూ పిల్లలకు స్నాక్స్ రూపంలో చిప్స్, బిస్కెట్లు, ఇతర జంక్ ఫుడ్స్ ఇస్తుంటారు. అలా కాకుండా స్నాక్స్ సమయంలో బాదంపప్పును తినిపించడం మంచిది. దీంతో వారికి శక్తి లభిస్తుంది. శరీరంలో కొవ్వు చేరదు. బాదంపప్పులో ఉండే విటమిన్లు పిల్లలకు లభిస్తాయి. దీంతో వారికి తక్షణమే శక్తి లభిస్తుంది. ఉత్సాహంగా ఉంటారు. బాదంపప్పులో మెగ్నిషియం అధికంగా ఉంటుంది. ఇది అలసటను తగ్గిస్తుంది. చిన్నారులు యాక్టివ్‌గా ఉంటారు.
5. బాదంపప్పును తినడం వల్ల చిన్నారులు దృఢంగా ఉంటారు. వారిలో ఎముకలు దృఢంగా మారుతాయి. బాదంపప్పులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇది ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. చిన్నారులు ఆడుకునే సమయంలో సహజంగానే కొన్ని సార్లు ఎముకలు విరుగుతాయి. అలాంటప్పుడు బాదం పప్పును తినిపిస్తే ఎముకలు త్వరగా అతుక్కుంటాయి. దృఢంగా మారుతాయి. బాదంపప్పులో కాల్షియం, మెగ్నిషియం, మాంగనీస్, విటమిన్ కె, ప్రోటీన్లు, కాపర్, జింక్ అధికంగా ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా ఉంచుతాయి.
చిన్నారులకు 6 నుంచి 9 నెలల వయస్సు మధ్యలో బాదంపప్పును తినిపించవచ్చు. కానీ వాటిని పొడి చేసి అందులో పాలు లేదా నీళ్లు కలిపి తినిపిస్తే మంచిది. ఇక 2 ఏళ్లకు పైబడిన పిల్లలకు రోజూ 3 లేదా 4 బాదంపప్పులను తినిపించవచ్చు. దీంతో వారు ఆరోగ్యంగా ఉంటారు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365