ఒకప్పుడు బయట దేశాలకు చెందిన పండ్లు మనకు అంతగా లభించేవి కావు. కానీ ఇప్పుడు మనకు ఎక్కడ చూసినా అవే కనిపిస్తున్నాయి. చాలా తక్కువ ధరలకు ఆ పండ్లు అందుబాటులో ఉంటున్నాయి. అలాంటి పండ్లలో లిచీ పండ్లు ఒకటి. ఇవి ఎరుపు రంగు తొక్కను కలిగి ఉంటాయి. కానీ లోపలి గుజ్జు బాగుంటుంది. ఈ పండ్లను తినడం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. లిచీ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. మనకు రోజూ కావల్సిన విటమిన్ సి కన్నా 100 శాతం ఎక్కువ విటమిన్ సి ని ఈ పండ్లు అందిస్తాయి. అందువల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తెల్ల రక్త కణాలు యాక్టివ్‌గా మారుతాయి. దీంతో శరీరంలోకి ప్రవేశించే సూక్ష్మ క్రిముల నుంచి రక్షణ లభిస్తుంది.
2. లిచీ పండ్లలో ఫైబర్ (పీచు పదార్థం) అధికంగా ఉంటుంది. ఇది మలబద్దకాన్ని తగ్గిస్తుంది. పేగుల్లో ఆహారం కదలిక సరిగ్గా ఉండేలా చేస్తుంది. దీంతోపాటు జీర్ణ రసాలు అధికంగా ఉత్పత్తి అవుతాయి. ఈ క్రమంలో మనం తినే ఆహారాల్లో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా గ్రహిస్తుంది.
3. లిచీ పండ్లలో ప్రొ యాంథో సయనైడిన్స్ అధికంగా ఉంటాయి. ఇవి దృఢమైన యాంటీ వైరల్ లక్షణాలను కలిగి ఉంటాయి. లిచీ పండ్లలో ఉండే లిచీటానిన్ ఎ2 అనే సమ్మేళనం వైరస్‌లను అడ్డుకుంటుంది. దీంతో వైరస్‌ల నుంచి రక్షణ లభిస్తుంది.
4. లిచీ పండ్లను తినడం వల్ల శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. ఈ పండ్లలో కాపర్ అధికంగా ఉంటుంది. అందువల్ల రక్త సరఫరా పెరుగుతుంది. అలాగే ఎర్ర రక్త కణాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. దీంతో రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు. దీంతోపాటు కణాలకు ఆక్సిజన్ ఎక్కువగా లభిస్తుంది.
5. లిచీ పండ్లను తినడం వల్ల బీపీ అదుపులో ఉంటుంది. శరీరంలోని ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి. ఈ పండ్లలో ఉండే పొటాషియం బీపీని అదుపు చేస్తుంది. పొటాషియం వల్ల రక్త నాళాలు ఇరుకుగా మారకుండా ఉంటాయి. దీంతో గుండె వ్యవస్థపై పడే ఒత్తిడి, భారం తగ్గుతాయి.
6. లిచీ పండ్లు చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. వీటిని తినడం వల్ల చర్మం కాంతింవంతంగా మారుతుంది. లిచీ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడకల్స్‌ను నాశనం చేస్తాయి. అలాగే ఈ పండ్లలో ఉండే విటమిన్ సి చర్మాన్ని సంరక్షిస్తుంది. వయస్సు మీద పడడం వల్ల వచ్చే వృద్ధాప్య ఛాయలను అడ్డుకుంటుంది. దీంతో యవ్వనంగా కనిపిస్తారు.
7. అధిక బరువు తగ్గేందుకు కూడ లిచీ పండ్లు సహాయ పడతాయి. వీటిల్లో ఉండే ఫైబర్ బరువును తగ్గిస్తుంది. ఈ పండ్లలో నీరు అధికంగా ఉంటుంది. అందువల్ల బరువు తగ్గేందుకు ఈ పండ్లు సహాయ పడతాయి. వీటిని తినడం వల్ల క్యాలరీలు కూడా తక్కువే లభిస్తాయి. దీంతో బరువును తగ్గించుకోవచ్చు.
8. ఈ పండ్లలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు ఉంటాయి. ఈ పండ్లలో ఉండే ఫ్లేవనాల్ వాపులను తగ్గిస్తుంది. దీంతో కణాలు ఆరోగ్యంగా ఉంటాయి.
9. లిచీ పండ్లలో మన శరీరానికి అవసరం అయిన మెగ్నిషియం, ఫాస్ఫరస్, ఐరన్, మాంగనీస్, కాపర్ తదితర మినరల్స్ ఉంటాయి. దీని వల్ల శరీరం కాల్షియంను బాగా శోషించుకుంటుంది. దీంతో ఎముకలు దృఢంగా మారుతాయి. ఆరోగ్యంగా ఉంటాయి.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365