కోవిడ్ వచ్చిన వారికి సహజంగానే దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. కొందరికి కొన్ని లక్షణాలు ఉంటాయి. కొందరికి అవే లక్షణాల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఇక కొందరికైతే అసలు ఏ లక్షణాలు ఉండవు. కానీ కొందరిలో గోర్ల రంగు, స్వరూపం మారుతాయి. అవును.. ఈ విధంగా జరిగితే కొందరికి అసలు కోవిడ్ వచ్చి పోయినట్లే తెలియదు. కానీ వారు తమ గోళ్లను పరిశీలించడం ద్వారా తమకు కోవిడ్ వచ్చిందా, రాలేదా.. అనే విషయాన్ని నిర్దారించుకోవచ్చు.
గోళ్లపై అర్ధ చంద్రాకారంలో చాలా మందికి ఒక షేప్ ఉంటుంది. అది సహజంగా తెల్లగా ఉంటుంది. అయితే కోవిడ్ వచ్చి పోయిన వారిలో అది ఎరుపు రంగులో కనిపిస్తుంది. ఆ విధంగా ఉంటే వారికి కోవిడ్ వచ్చిపోయినట్లే లెక్క. గోళ్ల కింది భాగంలో వైరస్ దాడి చేసి వాపులకు గురవడం వల్ల లేదా అక్కడి రక్తనాళాలు దెబ్బ తినడం వల్ల అలా ఎరుపుగా కనిపిస్తుంది.
ఇక కోవిడ్ వచ్చిన వారిలో కొందరికి గోళ్లపై తెలుపు రంగులో సమాంతర రేఖలు కనిపిస్తాయి. కొందరికి అదే అర్థ చంద్రాకారం నారింజ రంగులో ఉంటుంది. ఇలా భిన్న రకాలుగా గోళ్లు కనిపిస్తాయి. అయితే గోళ్లు పెరిగేందుకు సహజంగానే కొన్ని వారాల సమయం పడుతుంది కనుక కోవిడ్ వచ్చి పోయాకే పైన తెలిపిన విధంగా గోళ్లు కనిపిస్తాయి.
ఇక ఇలా కోవిడ్ వచ్చిన వారిలో గోళ్ల రంగు మారడాన్ని కోవిడ్ నెయిల్స్ అంటారు. అంటే.. కోవిడ్ వల్ల గోళ్ల రంగు మారుతుందన్నమాట. సాధారణంగా గోళ్లు నెలకు 2ఎంఎం నుంచి 5ఎంఎం వరకు పెరుగుతాయి. అందువల్ల కోవిడ్ వచ్చి తగ్గాక 4-5 వారాల్లో గోళ్లు రంగు మారి కనిపిస్తాయి. కానీ వాటి కోసం ఎలాంటి చికిత్స తీసుకోవాల్సిన పనిలేదు. కోవిడ్ తగ్గితే కొన్ని వారాలకు గోళ్లు కూడా సాధారణ స్థితిలో కనిపిస్తాయి. అందువల్ల ఈ విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365