సాధారణంగా మన ఇళ్లలో చాలా మంది తెల్ల ఉప్పును వాడుతారు. అయోడైజ్డ్ సాల్ట్ అని చెప్పి మార్కెట్‌లో దొరికే ఉప్పును వాడుతారు. అయితే నిజానికి ఈ ఉప్పు కన్నా నల్ల ఉప్పును వాడడం ఎంతో శ్రేయస్కరం. నల్ల ఉప్పు వల్ల మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. నల్ల ఉప్పును వాడడం వల్ల శరీరంలో ఉండే సూక్ష్మ క్రిములు నశిస్తాయి. శరీరంలోని కొవ్వు కరుగుతుంది. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా నల్ల ఉప్పును కలిపి రోజూ ఉదయాన్నే పరగడుపునే తాగితే ఫలితం కనిపిస్తుంది.
2. నల్ల ఉప్పులో అనేక పోషకాలు ఉంటాయి. మన శరీరానికి ఉపయోగపడే ముఖ్యమైన మినరల్స్ ఉంటాయి. అందువల్ల తరచూ నల్ల ఉప్పును తింటే ఎముకలు దృఢంగా మారుతాయి.
3. షుగర్ పేషెంట్లకు నల్ల ఉప్పు ఎంతగానో మేలు చేస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల వారి శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. ఆరోగ్యంగా ఉండవచ్చు.
4. చిన్నారులకు నల్ల ఉప్పు ఎంతగానో మేలు చేస్తుంది. వారిలో అజీర్ణం సమస్యను తగ్గిస్తుంది. ప్లీహం ఏర్పడకుండా ఉంటుంది. రోజూ పిల్లలకు ఆహారంలో నల్ల ఉప్పును ఇవ్వాలి. దీంతో వారిలో జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి.
5. అజీర్ణం సమస్యతో బాధపడేవారు రోజూ నల్ల ఉప్పును తింటే ఫలితం కనిపిస్తుంది. జీర్ణశక్తి పెరుగుతుంది.
సూచన – సాధారణ ఉప్పు కన్నా నల్ల ఉప్పు ఎన్నో విధాలా మంచిదే. అయితే సాధారణ ఉప్పుతో పోలిస్తే నల్ల ఉప్పులో సోడియం అధికంగా ఉంటుంది. కనుక దీన్ని చాలా స్వల్ప మోతాదులో వాడుకోవాలి. ఇక కిడ్నీ స్టోన్స్ సమస్య ఉన్నవారు ఈ ఉప్పును వాడకపోవడమే మంచిది.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365