అసలే కరోనా సమయం. మాయదారి కరోనా సెకండ్ వేవ్ రూపంలో తీవ్రంగా వ్యాప్తి చెందుతోంది. దీంతో కరోనా రాకుండా అడ్డుకునేందుకు చాలా మంది మాస్కులు ధరిస్తున్నారు. శానిటైజర్లు వాడుతున్నారు. అయితే రోగ నిరోధక శక్తిని పెంచుకోవాల్సిన ఆవశ్యకత కూడా ఏర్పడింది. అందులో భాగంగానే కింద తెలిపిన 6 సహజసిద్ధమైన డ్రింక్స్ మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. వ్యాధుల నుంచి సురక్షితంగా ఉండవచ్చు. మరి ఆ డ్రింక్స్ ఏమిటంటే…
1. ఒక పాత్రలో నీటిని తీసుకుని అందులో కొద్దిగా పసుపు, కొన్ని లవంగాలు, నల్ల మిరియాలు, అల్లం, తులసి ఆకులు, వేపాకులు, మెంతులు, దాల్చిన చెక్క వేసి బాగా మరిగించాలి. అనంతరం వచ్చే మిశ్రమాన్ని వడకట్టి తాగాలి. ఇది రోగ నిరోధక శక్తిని గణనీయంగా పెంచుతుంది. వ్యాధులు రాకుండా చూస్తుంది.
2. వేసవిలో సహజంగానే చాలా మంది మామిడిపండ్లను తింటుంటారు. కానీ పచ్చిమామిడి కాయలతో తయారు చేసే ఈ డ్రింక్‌ను తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. పచ్చిమామిడి కాయలను ముందుగా నీటిలో ఉడకబెట్టాలి. తరువాత వాటి గుజ్జును తీసి అందులో తగినన్ని నీళ్లు కలిపి డ్రింక్‌లా తయారు చేయాలి. తరువాత అందులో కొద్దిగా జీలకర్ర పొడి, నల్ల ఉప్పు వేసి కలిపి తాగాలి. దీంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే డయేరియా, డీహైడ్రేషన్ సమస్యలు తగ్గుతాయి.
3. రోజూ పాలకూర, కీరదోస, ఉసిరికాయ జ్యూస్‌లను తాగాలి. ఇవి శరీరాన్ని దృఢంగా ఉంచుతాయి. పాలకూర, ఉసిరికాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, బీటా కెరోటిన్ ఉంటాయి. దీని వల్ల ఇన్‌ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడే శక్తి లభిస్తుంది. ఇక కీరదోస వల్ల శరీరంలోని ద్రవాలు సమతుల్యలో ఉంటాయి. కీరదోసను జ్యూస్‌గా చేసుకుని తాగవచ్చు. లేదా నేరుగా కూడా తినవచ్చు. దీంతో రోగ నిరోధక శక్తి పెరగడమే కాదు, చర్మం కాంతివంతంగా మారుతుంది.
4. బిల్వ పత్రం చెట్టు కాయలతో తయారు చేసిన బేల్ సిరప్ మార్కెట్‌లో లభిస్తుంది. దీన్ని కూడా సేవించవచ్చు. దీన్ని వేసవిలో తాగడం వల్ల లాభాలు కలుగుతాయి. వేసవి తాపం నుంచి బయట పడవచ్చు. ఈ సిరప్‌ను తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో ఉండే ఫైబర్, విటమిన్ సి, పొటాషియం, కాల్షియం, ఐరన్, ఇతర పోషకాలు బాక్టీరియా, వైరస్‌లను నాశనం చేస్తాయి. రోగాలు రాకుండా చూస్తాయి.
5. వేసవి తాపం తగ్గించేందుకు గసగసాలు ఎంతగానో ఉపయోగపడతాయి. వీటితో జ్యూస్ చేసుకుని రోజూ స్వల్ప మోతాదులో తాగవచ్చు. దీని వల్ల శరీరంలో ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి. ఎండ దెబ్బ బారిన పడకుండా ఉంటారు. గసగసాల్లో ఐరన్, మాంగనీస్, విటమిన్ బి6, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడుతాయి.
6. ఒక గ్లాస్ మజ్జిగలో నల్ల ఉప్పు, జీలకర్ర పొడి, పుదీనా ఆకుల రసం కొద్దిగా కలిపి తీసుకుంటే వేసవి తాపం నుంచి బయట పడవచ్చు. ఎండ దెబ్బ బారిన పడకుండా ఉంటారు. శరీరానికి అవసరం అయ్యే ప్రోటీన్లు లభిస్తాయి. శరీరం చల్లగా మారుతుంది. జీర్ణవ్యవస్థ బలపడుతుంది. శరీరంలో రక్తం వృద్ధి అవుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ పానీయంలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు ఎ, సి, ఇ లు అధికంగా ఉంటాయి. దీని వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365