వేసవి కాలంలో మనకు సహజంగానే అనేక అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. కనుక ఈ సీజన్‌లో మనం ఆరోగ్యంగా ఉండాలి. అందుకు గాను పోషకాలు కలిగిన ఆహారాలను తీసుకోవాలి. ఇక ఈ సీజన్లో తీసుకోవాల్సిన పండ్లలో బత్తాయి పండ్లు కూడా ఒకటి. వీటిని వేసవిలో తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. బత్తాయి పండ్లలో ఫైబర్, విటమిన్లు, పొటాషియం అధికంగా ఉంటాయి. ఇవి మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తాయి.
బత్తాయి పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇన్‌ఫెక్షన్లు, వ్యాధులు రాకుండా చూస్తుంది. బత్తాయి పండ్లను తినడం లేదా వాటి జ్యూస్‌ను తాగడం వల్ల జలుబు తగ్గుతుంది.
బత్తాయి పండ్లను తినడం వల్ల శరీరంలోని విష, వ్యర్థ పదార్థాలు బయటకుపోతాయి. శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది. చర్మ సమస్యలు తగ్గుతాయి. నోట్లో పొక్కులు తగ్గిపోతాయి.
హైబీపీ ఉన్నవారు రోజూ బత్తాయి పండ్లను తినాలి. దీని వల్ల బీపీ నియంత్రణలో ఉంటుంది. మలబద్దకం సమస్య ఉన్నవారు ఈ పండ్లను రోజూ తినవచ్చు. దీని వల్ల ఇతర జీర్ణ సమస్యలు కూడా తగ్గుతాయి. ముఖ్యంగా గ్యాస్ సమస్య నుంచి బయట పడవచ్చు.
షుగర్ ఉన్నవారు కూడా నిర్భయంగా ఈ పండ్లను తినవచ్చు. దీని వల్ల షుగర్ లెవల్స్ పెరగవు. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలోనే ఉంటాయి.
వేసవిలో బత్తాయి పండ్లను నేరుగా తినలేకపోతే జ్యూస్ చేసుకుని తాగవచ్చు. రోజుకు ఒక గ్లాస్ జ్యూస్ తాగితే చాలు. పైన తెలిపిన ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే శరీరానికి శక్తి లభిస్తుంది. అలసట తగ్గుతుంది. అనేక పోషకాలు అందుతాయి. సీజనల్‌గా వచ్చే వ్యాధులు రాకుండా ఉంటాయి.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365