మూత్రంలో నురుగు వ‌స్తుందా ? అయితే అందుకు కార‌ణాల‌ను తెలుసుకోండి..!

సాధార‌ణంగా ప్ర‌తి ఒక్క‌రికీ మూత్రం లేత ప‌సుపు రంగులో వ‌స్తుంది. నీళ్లు ఎక్కువ‌గా తాగే వారికి మూత్రం తెల్ల‌గా వ‌స్తుంది. నీళ్లను త‌క్కువ‌గా తాగితే మూత్రం ప‌సుపు రంగులో ద‌ర్శ‌న‌మిస్తుంది. ఇలా భిన్న ర‌కాలుగా మూత్రం క‌నిపిస్తుంది. అయితే కొంద‌రికి మూత్రంలో నురుగు వ‌స్తుంది. దాని వెనుక ఉండే కార‌ణాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

if your urine is having foam then you should know the reasons

* మూత్ర‌శ‌యం బాగా నిండిన‌ప్పుడు స‌హ‌జంగానే మూత్ర విస‌ర్జ‌న చేస్తే మూత్రం బాగా వేగంగా వ‌స్తుంది. మూత్రాన్ని బాగా వేగంతో పోసిన‌ప్పుడు మూత్రంలో స‌హ‌జంగానే నురుగు క‌నిపిస్తుంది. ఇలా గ‌న‌క జ‌రిగితే కంగారు ప‌డాల్సిన ప‌నిలేదు.

* అథ్లెట్లు, క్రీడాకారులు, శారీర‌క శ్ర‌మ ఎక్కువ‌గా చేసే వారి మూత్రంలో నురుగు క‌నిపిస్తుంది. వీరు కూడా ఆందోళ‌న చెందాల్సిన ప‌నిలేదు.

పైన తెలిపిన రెండు కార‌ణాలు కాక‌పోతే క‌చ్చితంగా వేరే కార‌ణాలు ఉంటాయి. అవేమిటంటే..

మూత్రంలో ప్రోటీన్ ఎక్కువ‌గా పోయే వారికి మూత్రంలో నురుగు వ‌స్తుంది. కిడ్నీ స‌మ‌స్య‌లు ఉన్న‌వారికి, నెఫ్రోటిక్ సిండ్రోమ్‌, నెఫ్రైటిస్‌, కిడ్నీ ఫెయిల్యూర్‌, మూత్రాశ‌య ఇన్ఫెక్ష‌న్ ఉన్న‌వారికి స‌హ‌జంగానే ఇలా జ‌రుగుతుంది. వారి మూత్రంలో నురుగు క‌నిపిస్తుంది. అయితే పైన ఇచ్చిన రెండు కార‌ణాలు కాక‌పోతే ఇప్పుడు తెలిపిన కార‌ణాల వ‌ల్లే మూత్రంలో నురుగు వ‌స్తున్న‌ట్లు అనుమానించాలి. వెంట‌నే డాక్ట‌ర్‌ను క‌లిసి ప‌రీక్ష‌లు చేయించుకుని అందుకు అనుగుణంగా మందుల‌ను వాడాలి. లేదంటే స‌మ‌స్య తీవ్ర‌త‌రం అయ్యేందుకు అవ‌కాశం ఉంటుంది. క‌నుక ఈ విష‌యంలో నిర్ల‌క్ష్యం వ‌హించ‌రాదు.

Admin

Recent Posts