మనం రోజూ మనకు నచ్చిన రుచిలో ఉండే ఆహార పదార్థాలను తింటుంటాం. కొందరు తీపి పదార్థాలను ఎక్కువగా తింటారు. కొందరు కారంను తింటే కొందరు పులుపు అంటే ఇష్టపడతారు. అయితే చాలా మంది కారంగా ఉంటాయని మిరపకాయలను తినేందుకు వెనుకాడుతుంటారు. కానీ వాటిని తినకపోతే అనేక ప్రయోజనాలను కోల్పోవాల్సి వస్తుంది. మిరపకాయల్లోనూ మన శరీరానికి ఉపయోగపడే అనేక పోషకాలు ఉంటాయి. కనుక వాటిని కూడా మనం రోజూ తినాల్సిందే.
1. మిరపకాయల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వాటిని తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వాటిలో విటమిన్లు ఎ, బి, ఇ, కె, పొటాషియం, కాపర్ కూడా అధికంగానే ఉంటాయి. మిరపకాయల్లో క్యాప్సెయిసిన్ ఉంటుంది. అందువల్లే అవి కారంగా ఉంటాయి. ఈ పోషక పదార్థం యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేస్తుంది. అందువల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
2. సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల ప్రకారం.. మిరపకాయలను రోజూ తినడం వల్ల అధిక బరువును తగ్గించుకోవచ్చని తేలింది. ఇవి ఆకలిని నియంత్రిస్తాయి. దీని వల్ల ఎక్కువ ఆహారం తినకుండా జాగ్రత్త పడవచ్చు. అలాగే మిరపకాయలను తినడం వల్ల శరీర మెటబాలిజం పెరుగుతుంది. కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు.
3. ఆర్థరైటిస్, ఇతర నొప్పులు ఉన్నవారు రోజూ మిరపకాయలను తింటుండాలి. దీంతో నొప్పులు తగ్గిపోతాయి.
4. మిరపకాయల్లో ఉండే సమ్మేళనాలను 40 రకాల క్యాన్సర్లను రాకుండా చూస్తాయని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో వెల్లడైంది. అందువల్ల మిరపకాయలను రోజూ తీసుకోవడం మరిపోరాదు.
5. మిరపకాయలను రోజూ తినడం వల్ల త్వరగా చనిపోయే అవకాశాలు 13 శాతం వరకు తగ్గుతాయని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల్లో తేలింది. వాటిని తినడం వల్ల ఎక్కువ కాలం పాటు జీవిస్తారని సైంటిస్టులు చెబుతున్నారు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365