ఆహారం

రోజూ ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌లో ఒక క‌ప్పు ట‌మాటా సూప్‌ను తాగాల్సిందే.. అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు..!

ట‌మాటాల్లో ఎన్నో విట‌మిన్లు, మిన‌ర‌ల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, వృక్ష సంబంధ స‌మ్మేళ‌నాలు ఉంటాయి. ఇవి మ‌న‌కు ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి. సైంటిస్టులు చేప‌ట్టిన అధ్య‌య‌నాల ప్ర‌కారం.. ట‌మాటాల్లో ఉండే పోష‌కాలు అనేక వ్యాధుల‌పై పోరాటం చేస్తాయి. ముఖ్యంగా గుండె జ‌బ్బులు, క్యాన్స‌ర్ వంటి ప్రాణాంత‌క వ్యాధులును రాకుండా మ‌న‌ల్ని ర‌క్షిస్తాయి. అందువ‌ల్ల ట‌మాటాల‌ను తీసుకోవాలి. అయితే రోజూ ట‌మాటాల‌ను నేరుగా తీసుకోలేని వారు సూప్ రూపంలోనూ వాటిని తీసుకోవ‌చ్చు. దీంతో అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

take one cup of tomato soup every day for good health

1. ట‌మాటా సూప్‌లో ఫైబ‌ర్‌, ప్రోటీన్లు, విట‌మిన్లు ఎ, సి, కె, పొటాషియం, కెరోటినాయిడ్స్‌, లైకోపీన్ వంటి పోష‌కాలు ఉంటాయి. ఇవి వ్యాధుల‌ను రాకుండా చూస్తాయి. ఆరోగ్యంగా ఉంచుతాయి. పోష‌ణ‌ను అందిస్తాయి.

2. ట‌మాటాల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడిక‌ల్స్ ను నాశ‌నం చేసి క‌ణాల‌ను ర‌క్షిస్తాయి. రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. వాపుల‌ను త‌గ్గిస్తాయి.

3. ట‌మాట‌ల్లో లైకోపీన్ అధికంగా ఉంటుంది. ఇది ప‌లు ర‌కాల క్యాన్సర్లు రాకుండా చూస్తుంది. ప్రోస్టేట్‌, బ్రెస్ట్ క్యాన్స‌ర్‌లు రాకుండా అడ్డుకోవ‌చ్చు. లైకోపీన్ క్యాన్స‌ర్ క‌ణాలు పెర‌గ‌కుండా నాశ‌నం చేస్తుంది. మ‌న‌ల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

4. ట‌మాటాల్లో బీటా కెరోటిన్ అధికంగా ఉంటుంది. ఇది చ‌ర్మాన్ని ర‌క్షిస్తుంది. సూర్యుని నుంచి వ‌చ్చే అతినీల‌లోహిత కిర‌ణాల బారి నుంచి చ‌ర్మాన్ని సంర‌క్షిస్తుంది. ట‌మాటాల్లో ఉండే విట‌మిన్ ఎ కంటి చూపును మెరుగు ప‌రుస్తుంది.

5. ఆస్టియోపోరోసిస్ అనే వ్యాధి రావ‌డం వ‌ల్ల ఎముక‌లు గుల్ల‌గా మారుతాయి. దీంతో ఎముక‌లు విరిగిపోయేందుకు అవ‌కాశం ఉంటుంది. అయితే ఈ వ్యాధి రాకుండా ఉండాలంటే రోజూ ట‌మాటాల‌ను తినాలి. రోజూ ఒక క‌ప్పు ట‌మాటా సూప్‌ను తాగినా ఎముక‌ల‌ను ఆరోగ్యంగా, దృఢంగా ఉంచుకోవ‌చ్చు. కీళ్ల వ్యాధులు రాకుండా నివారించ‌వ‌చ్చు.

6. ట‌మాటాల్లో ఉండే లైకోపీన్ చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్‌)ను త‌గ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్‌)ను పెంచుతుంది. దీని వ‌ల్ల ర‌క్త నాళాల్లో కొవ్వు ప‌దార్థాలు పేరుకుపోకుండా చూసుకోవ‌చ్చు. హార్ట్ ఎటాక్‌లు రాకుండా అడ్డుకోవ‌చ్చు.

7. ట‌మాటాల్లో ఉండే లైకోపిన్ పురుషుల్లో శృంగార సామ‌ర్థ్యాన్ని పెంచుతుంది. వారిలో వీర్యం ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అయ్యేలా చేస్తుంది. శుక్ర క‌ణాల క‌ద‌లిక‌ల‌ను స‌రిగ్గా ఉంచుతుంది. దీంతో సంతానం క‌లిగే అవ‌కాశాలు మెరుగు ప‌డ‌తాయి.

8. రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలోనూ ట‌మాటా సూప్ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. రోజూ క‌ప్పు మోతాదులో ట‌మాటా సూప్‌ను తాగుతుంటే రోగ నిరోధ‌క శ‌క్తి బాగా పెరుగుతుంది. వ్యాధులు, ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా చూసుకోవ‌చ్చు.

ట‌మాటా సూప్‌ను ఇలా త‌యారు చేసుకోవ‌చ్చు

కావ‌ల్సిన ప‌దార్థాలు

  • టమాటాలు – 8
  • నీళ్లు – 4 క‌ప్పులు
  • మిరియాల పొడి – 1 టీస్పూన్‌
  • కారం – 1 టీస్పూన్
  • జీలకర్ర పొడి – 1 టీస్పూన్
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీస్పూన్
  • ఉప్పు – రుచికి తగినంత

తయారు చేసే విధానం

టమాటాలను శుభ్రంగా కడిగి రెండు విజల్స్ వచ్చే వరకూ కుక్కర్ లో ఉడికించి పక్కన పెట్టాలి. తర్వాత వాటిని మిక్సీలో వేసి మెత్తగా ప‌ట్టుకోవాలి. ఈ మిశ్రమంలో నీటిని కలిపి స్ట‌వ్‌ మీద పెట్టాలి. బాగా మరుగుతుండగా మిరియాల పొడి, కారం, జీలకర్ర పొడి, అల్లం, వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి బాగా కలపాలి. మంట తగ్గించి మరో 10 నిమిషాల పాటు మరిగించాలి. అనంతరం దించేయాలి. పుదీనా చల్లుకుని వేడి వేడిగా సేవిస్తే ట‌మాటా సూప్‌ చాలా రుచిగా ఉంటుంది. దీన్ని రోజూ ఉద‌యాన్నే బ్రేక్‌ఫాస్ట్‌లో ఒక క‌ప్పు మోతాదులో తాగ‌వ‌చ్చు. దీంతో పైన తెలిపిన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Admin

Recent Posts