మార్కెట్‌లో మనకు సాధారణ ఉప్పుతోపాటు హిమాలయన్ ఉప్పు కూడా అందుబాటులో ఉంది. దీన్ని ఇప్పుడిప్పుడే చాలా మంది వాడడం మొదలు పెట్టారు. హిమాలయ పర్వత ప్రాంతాల్లో గనుల్లో ఈ ఉప్పును తవ్వి వెలికితీసి శుభ్రం చేస్తారు. సాధారణ ఉప్పుతో పోలిస్తే హిమాలయన్ ఉప్పులో అనేక పోషకాలు, ముఖ్యమైన మినరల్స్ ఉంటాయి. అందువల్ల ఈ ఉప్పు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తుంది.
1. సాధారణ ఉప్పుకు బదులుగా హిమాలయన్ ఉప్పును వాడడం వల్ల శరీరంలోని విష, వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. ఈ ఉప్పులో ఉండే పొటాషియం, ఐరన్, కాల్షియం వంటి మూలకాలు శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపుతాయి. బాక్టీరియా నిర్మూలనకు దోహదపడతాయి.
2. సాధారణ ఉప్పు కొంచెం అధికమైతే బీపీ పెరుగుతుంది. ఎందుకంటే అందులో సోడియం అధికంగా ఉంటుంది. కానీ హిమాలయన్ ఉప్పులో సోడియం తక్కువగా ఉంటుంది. అందువల్ల బీపీ నియంత్రణలో ఉంటుంది. అలాగే కిడ్నీలపై భారం అధికంగా పడకుండా ఉంటుంది.
3. సాధారణ ఉప్పులో కృత్రిమంగా అయోడిన్‌ను కలుపుతారు. కానీ హిమాలయన్ ఉప్పులో సహజసిద్ధమైన అయోడిన్ ఉటుంది. ఇది ఎలక్ట్రోలైట్లను సమతుల్యం చేస్తుంది. శరీరం పోషకాలను గ్రహించేలా చేస్తుంది. హైబీపీ తగ్గుతుంది.
3. హిమాలయన్ సాల్ట్‌ను తీసుకోవడం వల్ల శరీరం పీహెచ్ స్థాయిలు సమతుల్యంలో ఉంటాయి. ఈ ఉప్పులో ఉండే ఖనిజ పదార్థాలు శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
4. హిమాలయన్ సాల్ట్‌ను వాడడం వల్ల శ్వాస కోశ ఆరోగ్యం మెరుగు పడుతుందని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో వెల్లడైంది. ముఖ్యంగా సీవోపీడీ రోగులకు ఉపశమనం కలుగుతుందని తెలిపారు.
5. స్నానం చేసే నీటిలో కొద్దిగా హిమాలయన్ సాల్ట్‌ను కలుపుకుని స్నానం చేస్తే చర్మం సంరక్షించబడుతుంది. సూక్ష్మ్ క్రిములు నశిస్తాయి.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365