ప్రస్తుత కాలంలో మన ఆహారం విషయంలో అనేక మార్పులు చోటు చేసుకోవడం వల్ల అధికంగా శరీర బరువు పెరుగుతున్నారు. దీని వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. కనుక శరీర బరువును నియంత్రించుకోవడం వల్ల ఆయా అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందడమే కాకుండా ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొందవచ్చు. అయితే శరీర బరువు తగ్గాలనుకునేవారు తమ ఆహారంలో పీనట్ బటర్‌ను చేర్చడం వల్ల త్వరగా శరీర బరువు తగ్గుతుంది.
పీనట్ బటర్ ను తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలంగా లభిస్తాయి. దీని వల్ల శరీరానికి నిరంతర శక్తి అందుతుంది. 2017లో ఓ సర్వేలో భాగంగా దాదాపు 73 శాతం మంది భారతీయులకు ప్రోటీన్ల లోపం ఉన్నట్లు వెల్లడయింది. ప్రోటీన్ల లోపం ఉన్నవారు ప్రతి రోజూ 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల పీనట్ బటర్‌ను తీసుకోవడం వల్ల వారి శరీరానికి కావలసినన్ని ప్రోటీన్లు అందుతాయి.
పీనట్ బటర్‌ను శాండ్ విచ్ లేదా రొట్టెలలో కలిపి తీసుకోవచ్చు. అయితే పీనట్ బటర్‌ను అధిక పరిమాణంలో తీసుకోవడం వల్ల అధికంగా శరీర బరువు పెరుగుతారు. వీటిలో అధిక మొత్తం కేలరీలు ఉండటం వల్ల శరీర బరువు పెరగడానికి దోహదపడుతుంది. కనుక బరువు పెరగాలనుకునేవారు దీన్ని ఎక్కువగా తినాలి. అదే తగ్గాలనుకునేవారు దీన్ని తక్కువ పరిమాణంలో ప్రతి రోజూ తీసుకోవచ్చు. దీంతో ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందడమే కాకుండా బరువును కూడా తగ్గించుకోవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.
శరీర బరువు తగ్గాలనుకొనే వారు ప్రతిరోజు పీనట్ బటర్‌ను స్వల్ప మోతాదులో తీసుకోవటం వల్ల మన ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపిస్తుంది. శరీర బరువు తగ్గాలనుకొనే వారికి పీనట్ బటర్ ఒక మంచి ఆహార పదార్థంగా ఉపయోగపడుతుంది.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365