Health Tips : సాధారణంగా చాలామంది వారి శరీర బరువు తగ్గడం కోసం ఎన్నో రకాల ఆహార నియమాలను పాటిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే వివిధ కాలాలకు అనుగుణంగా వారి డైట్ చార్ట్ లో మార్పులు చేసుకుంటుంటారు. చలికాలంలో శరీర బరువు తగ్గాలని భావించేవారు ఈ కాలంలో లభించే వివిధ రకాల పండ్లను తినడం వల్ల త్వరగా శరీర బరువు తగ్గవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు. మరి శరీర బరువును తగ్గించే ఆ పండ్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. విటమిన్ సి అధికంగా ఉండే సిట్రస్ జాతి పండ్లును ఈ సీజన్‌లో అధికంగా తీసుకుంటే శరీర బరువు తగ్గుతారు. నారింజ, బత్తాయి, కివీ, పైనాపిల్, జామ పండ్లను తింటే బరువు తగ్గుతారు.
2. విటమిన్ సి తోపాటు ఫోలేట్, డైటరీ ఫైబర్ అధికంగా ఉండే కివి పండ్లను చలికాలంలో తినడం వల్ల మన శరీరానికి కావలసిన పోషకాలు లభిస్తాయి. దీంతోపాటు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మెటబాలిజం పెరిగి జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది మన శరీర బరువు తగ్గడానికి దోహదపడుతుంది.
3. క్యారెట్ లో విటమిన్ ఎ, ఫైబర్ అధికంగా ఉంటాయి. అందువల్ల వీటిని ఈ సీజన్‌లో తప్పక తినాలి. చాలా మంది పచ్చిగా తినడానికే ఇష్టపడతారు. ప్రతి రోజూ ఒక గ్లాసు క్యారెట్ జ్యూస్ లేదా ఒక క్యారెట్ ను పచ్చిగా తినడం వల్ల శరీర బరువును త్వరగా తగ్గించుకోవచ్చు. దీంతోపాటు పోషకాలు లభిస్తాయి. ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
4. పుచ్చకాయలు అంటే వేసవిలోనే తినాలని అనుకుంటారు. కానీ ఈ సీజన్‌లోనూ వాటిని తినవచ్చు. వీటిలో తక్కువ క్యాలరీలు ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. కనుక బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది. పుచ్చకాయలను కూడా ఈ సీజన్‌లో తీసుకోవాలి.
5. ఈ పండ్లతోపాటు రోజూ యాపిల్స్, దానిమ్మ పండ్లను తిన్నా కూడా ఈ సీజన్‌లో బరువును సులభంగా తగ్గించుకోవచ్చు.