Health Tips : ఈ సీజన్‌లో శరీరం వెచ్చగా ఉండాలంటే.. ఈ ఆహారాలను తీసుకోవాల్సిందే..!

Health Tips : సాధారణంగా వాతావరణంలో మార్పులకు అనుగుణంగా మన జీవనశైలిలో కూడా మార్పులు చోటు చేసుకోవాలి. ఈ క్రమంలోనే వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మన ఆహారనియమాలను మార్చుకున్నప్పుడే ఎంతో ఆరోగ్యంగా ఉండగలం. లేకపోతే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది.

Health Tips to keep warm in this winter take these foods

ప్రస్తుతం చలికాలం కావడంతో పూర్తిగా మన ఆహారంలో పలు మార్పులను చోటుచేసుకోవాలి. ఇలా మార్పులు చోటు చేసుకున్నప్పుడే మన శరీరం ఎంతో వెచ్చగా ఉండి మన జీవ ప్రక్రియలు సక్రమంగా జరుగుతాయని నిపుణులు తెలియజేస్తున్నారు.

మన శరీరానికి చలిని తట్టుకునే శక్తి కావాలంటే మన ఆహార పదార్థాలలో ఎక్కువగా పెసలు, మినుములు, శనగలు, గోధుమలు వంటి ఆహార పదార్థాలను చేర్చుకోవాలి. అదేవిధంగా పాలు, పాల పదార్థాలను కూడా అధికంగా తీసుకోవడం వల్ల మన శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవచ్చు.

ముఖ్యంగా ఉదయం చేసిన వంటలను రాత్రి తినకూడదు. ఎప్పటికప్పుడు వేడిగా చేసుకొని తినడం వల్ల మన శరీరం వెచ్చగా ఉండటమే కాకుండా ఏ విధమైనటువంటి జీర్ణక్రియ సమస్యలు ఉండవు.

చలికాలంలో ప్రతి రోజు ఒక పండును తీసుకోవడం వల్ల మన చర్మం పొడి బారకుండా తేమగా ఉంటుంది. దీంతో చర్మం పగలదు. చర్మానికి కావలసినంత తేమ సమకూరడమే కాకుండా రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

అలాగే మన శరీరంలో వ్యాధికారక క్రిములు దూరం కావాలంటే ఎక్కువగా అల్లం, పసుపు, జీలకర్ర, మిరియాలు వంటి పదార్థలను అధికంగా తీసుకోవాలి. ఈ విధమైన ఆహారపదార్థాలను తీసుకుంటే మన శరీరం ఎంతో వెచ్చగా ఉంటుంది. చలి నుంచి తట్టుకోవచ్చు. రోగాలు రాకుండా చూసుకోవచ్చు.

Share
Sailaja N

Recent Posts