Health Tips : ప్రస్తుతం మనకు టెక్నాలజీ అందుబాటులో ఉండడంతో ఏది కావాలన్నా సులభంగా లభిస్తోంది. అందులో భాగంగానే వంట చేసేందుకు కూడా అనేక రకాల ఆధునిక సామగ్రి అందుబాటులోకి వచ్చింది. దీంతో ఏ వంటకం చేయాలనుకున్నా నిమిషాల్లోనే పూర్తి చేస్తున్నాం. అయితే వాస్తవానికి ఏ వంట చేసినా మట్టి కుండల్లోనే వండాలి. అది ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.
1. మైక్రోవేవ్ ఓవెన్‌లలో వంటలు చేసేవారు ఎక్కువగా ప్లాస్టిక్‌ను లేదా గ్లాస్ వస్తువులను ఉపయోగిస్తుంటారు. అయితే కుండలను కూడా వాడవచ్చు. దీంతో వంట త్వరగా అవడమే కాదు, ఆరోగ్యంగా ఉండవచ్చు. మైక్రోవేవ్ ఓవెన్‌లో మట్టి కుండలను పెట్టి వంటలను చేయవచ్చు. అందులో సందేహించాల్సిన పనిలేదు. మట్టి కుండల్లో వంట చేయడం వల్ల ఎలాంటి హానికర పదార్థాలు ఉత్పన్నం కావు. దీంతో ఆహార పదార్థాలు ఆరోగ్యవంతం అవుతాయి. రుచిగా కూడా ఉంటాయి.
2. మైక్రోవేవ్ కాకుండా సాధారణ వంటకు కూడా చాలా మంది ఇతర లోహాలకు చెందిన పాత్రలను ఉపయోగిస్తుంటారు. కానీ మట్టితో తయారు చేసిన కుండలను వాడాలి. ప్రస్తుతం చాలా మంది సెలబ్రిటీలను ఈ విధంగానే చేస్తున్నారు. కనుక మట్టి కుండలను వాడితే మంచిది. వీటి వల్ల ఆరోగ్యవంతమైన ఆహారాన్ని వండి తినవచ్చు.
3. పూర్వకాలంలో మన పెద్దలు పాలు, పెరుగు, నెయ్యి వంటి వాటిని ఎక్కువగా మట్టి కుండల్లోనే నిల్వ చేసేవారు. ఎందుకంటే పాలు, పాల ఉత్పత్తులను మట్టి కుండలో నిల్వ చేయడం వల్ల ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. తాజాగా ఉంటాయి. అలాగే పెరుగు, మజ్జిగ పుల్లగా మారకుండా ఉంటాయి. అందువల్ల పాలు, పాల ఉత్పత్తులకు కూడా మట్టి కుండలను ఉపయోగించాలి.
4. మట్టి కుండలు అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోలేవని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. అవి ఉష్ణోగ్రతలను తట్టుకుంటాయి. అంతేకాదు, వాటిల్లో వండిన ఆహారం ఎక్కువ సేపు తాజాగా, వేడిగా ఉంటుంది. కనుక మట్టి కుండల్లో వంట చేయడం మంచిది.
5. మట్టి కుండలను తయారు చేసేందుకు ఉపయోగించే మట్టి ఆల్కలైన్ స్వభావాన్ని కలిగి ఉంటుంది. అందువల్ల యాసిడ్లతో అది చర్య పొందుతుంది. దీనివల్ల ఆహారం పీహెచ్ స్థాయిలు తటస్థీకరించబడతాయి. ఈ క్రమంలో ఆ ఆహారాన్ని మనం తింటే సులభంగా జీర్ణం అవుతుంది. పోషకాలు కూడా ఎక్కువగా లభిస్తాయి.
కనుక ఎవరైనా సరే మట్టి కుండల్లో వంటలు చేసి వాటిలోని ఆహారాలను తింటే రుచికి రుచి, పోషకాలకు పోషకాలు లభిస్తాయి. దీంతో ఆరోగ్యంగా ఉండవచ్చు. హానికర వ్యర్థాలు మన శరీరంలో చేరవు.