Healthy Foods : ఈ పదార్థాలను నానబెట్టి తీసుకుంటే చాలు మనం 20 కి పైగా అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. వీటిని తీసుకోవడం వల్ల రక్తపోటు, గుండెలో మంట, డయాబెటిస్, కొలెస్ట్రాల్ పేరుకుపోవడం, రక్తప్రసరణ సాఫీగా సాగకపోవడం వంటి సమస్యలన్నీ నయం అవుతాయి. ఈ మూడు పదార్థాలు ఎంతో శక్తివంతమైనవి. వీటిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. వీటిని సరైన పద్దతిలో తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు నయం అవుతాయి. నరాల సమస్యలన్నీ తగ్గు ముఖం పడతాయి. మన ఆరోగ్యానికి మేలు చేసే ఈ పదార్థాలు ఏమిటి.. వీటిని ఎలా తీసుకోవాలి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మనం తీసుకోవాల్సిన మొదటి పదార్థం కాళోంజి విత్తనాలు. ఇవి మనకు ఎంతో సులభంగా లభిస్తాయి. వీటిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.
వీటిని సరైన పద్దతిలో తీసుకోవడం వల్ల చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, షుగర్ ను అదుపులో ఉంచడంలో, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను మన దరి చేరకుండా చేయడంలో, నొప్పులను తగ్గించడంలో ఇవి ఎంతో దోహదపడతాయి. ఇవి ఎంతో శక్తిమైనవి కనుక వీటిని తక్కువ మోతాదులో ఉపయోగించాలి. అలాగే మనం ఉపయోగించాల్సిన మరో పదార్థం అవిసె గింజలు. వీటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. గుంగె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇవి ఎంతగానో సహాయపడతాయి. జీర్ణశక్తిని మెరుగుపరచడంలో, మలబద్దకం సమస్యను తగ్గించడంలో, శరీర బరువును తగ్గించడంలో, చర్మం మరియు జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇలా అనేక విధాలుగా అవిసె గింజలు మనకు సహాయపడతాయి. అయితే అవిసె గింజలు శరీరంలో వేడిని పెంచుతాయి.
కనుక వీటిని తక్కువ మోతాదులో సరైన పద్దతిలో తీసుకోవాలి. ఇక మనం ఉపయోగించాల్సిన చివరి పదార్థం మెంతులు. మెంతులు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వాత దోషాలను, కఫ దోషాలను తగ్గించడంలో శరీరంలో వాపులను తగ్గించడంలో, రక్తాన్ని శుద్ది చేయడంలో, పొట్ట సంబంధిత సమస్యలను దూరం చేయడంలో ఇలా అనేక విధాలుగా మెంతులు మనకు సహాయపడతాయి. ఈ పదార్థాలను సరైన మోతాదులో, సరైన పద్దతిలో ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. దీని కోసం ముందుగా ఒక గ్లాస్ లో అర టీ స్పూన్ అవిసె గింజలు, అర టీ స్పూన్ కాళోంజి విత్తనాలను, అర టీ స్పూన్ మెంతులను వేసి దానిలో నీటిని పోయాలి. ఈ పదార్థాలను రాత్రంతా నీటిలో నానబెట్టాలి. ఉదయాన్నే ఈ నీటిని వడకట్టి ఈ నీటిని వేడి చేయాలి. ఇలా వేడి చేసిన నీటిని ఉదయం పరగడుపున తాగాలి. అలాగే ఈ పదార్థాలను నమిలి మింగాలి.
అయితే వేడి శరీరతత్వం ఉన్న వారు ఈ పదార్థాలను పెరుగుతో లేదా మజ్జిగతో తీసుకోవాలి.అలాగే ఈ పదార్థాలను పేస్ట్ గా చేసి చపాతీ పిండిలో కలిపి వాటితో చపాతీలను తయారు చేసుకోవచ్చు. అదే విధంగా కఫ శరీరతత్వం ఉన్న వారు ఈ మూడు పదార్థాలను తేనెతో కలిపి తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల కఫ దోషాలు తొలగిపోతాయి. ఈ విధంగా నీటిని తాగి ఈ పదార్థాలను తినడం వల్ల వాత, పిత్త, కఫ దోషాలు తొలగిపోతాయి. ఇలా 15 రోజుల పాటు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి. 15 రోజుల తరువాత రోజు మార్చి రోజు వీటిని తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల థైరాయిడ్ సమస్య కూడా అదుపులోకి వస్తుంది. ఈ విధంగా ఈ చిట్కాను వాడడం వల్ల మనం చాలా సులభంగా చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.