Heart Attack : చలికాలంలో, రకరకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. చలికాలంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా అవసరం. చలికాలంలో హార్ట్ ఎటాక్ రిస్కు కూడా బాగా ఎక్కువగా ఉంటుంది. చలికాలంలో జీవనశైలి బాగా మారుతుంది. చలికాలంలో చలి కారణంగా, చాలామంది వ్యాయామం కూడా చెయ్యరు. ఎక్కువగా నడవరు కూడా. పూర్తిగా శారీరిక శ్రమని తగ్గించేస్తారు. దీంతో, గుండె జబ్బుల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా హృదయ సంబంధిత సమస్యలతో బాధపడే వాళ్ళు, మీ ఇంట్లో ఉన్నట్లయితే, కచ్చితంగా ఈ సీజన్లో జాగ్రత్తగా చూసుకోవాలి.
చలి వలన మన ఆరోగ్యంపై ఎంతగానో ప్రభావితం చేస్తుంది. ఈ సీజన్లో రోగనిరోధక శక్తి తక్కువ ఉంటుంది. రకరకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. దగ్గు, జలుబు మొదలు ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సీజన్లో డయాబెటిస్, హార్ట్ పేషెంట్లు ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టాలి. చలికాలంలో గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. కాబట్టి, జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
గుండెపోటు అనేది ప్రాణాంతక సమస్య. దీనికి సకాలంలో చికిత్స చేయాలి. లేకపోతే, ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంది. అందుకని, సకాలంలో ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా అవసరం. కానీ, చాలా సార్లు గుండెపోటు లక్షణాలని చాలామంది గుర్తించరు. దీనితో ప్రాణాలని కోల్పోతారు. సైలెంట్ హార్ట్ ఎటాక్ అంటే కూడా గుండె పోటె. ఈ గుండె పోటు లక్షణాలు చాలా తక్కువ కనపడుతూ ఉంటాయి.
సైలెంట్ గుండెపోటు ఛాతి నొప్పి లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని కలిగించదు. అజీర్తి, మైకం గా అనిపించడం, నిద్రలేమి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అలానే అలసట, ఛాతి, కండరాల్లో ఒత్తిడి వంటివి కనపడుతుంటాయి. సైలెంట్ హార్ట్ ఎటాక్ కి అధిక బరువు కూడా ఒక కారణం. ఊబకాయం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ కి కారణం అవుతుంది. హై బీపీ వంటి సమస్యల వలన కూడా హార్ట్ ఎటాక్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది.