Chapati : మనం గోధుమపిండితో చపాతీలను తయారు చేసి ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. చపాతీలో మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బరువు తగ్గడంలో, మధుమేహాన్ని అదుపులో ఉంచడంలో, వివిధ రకాల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు మన దరి చేరకుండా చేయడంలో, జీర్ణశక్తిని మెరుగుపరచడంలో ఇలా అనేక రకాలుగా చపాతీ మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ప్రాసెస్డ్ చేసిన మైదాపిండితో చేసే పరాటాలు, పాస్తా, వైట్ బ్రెడ్ కంటే చపాతీలు ఎంతో మేలైనవి. చపాతీలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఫైబర్, ప్రోటీన్, విటమిన్స్, మినరల్స్ ఇలా ఎన్నో పోషకాలు ఉంటాయి. అనేక రకాల పోషకాలు ఉన్నప్పటికి చపాతీలో ప్రోటీన్ తక్కువగా ఉంటుంది. చపాతీ పరిమాణంపై దానిలో ఉండే ప్రోటీన్ ఆధారపడి ఉంటుంది.
6 అంగుళాల చపాతీలో కేవలం 3 నుండి 4 గ్రాముల ప్రోటీన్ మాత్రమే ఉంటుంది. అలాగే నూనె వేయకుండా కాల్చిన చపాతీలో 102 క్యాలరీల శక్తి, 22 గ్రాముల పిండి పదార్థాలు, 802 మైక్రో గ్రాముల సోడియం, 122 మైక్రో గ్రాముల పొటాషియం, 3 గ్రా. ఫైబర్, 5 గ్రాముల కొవ్వు ఉంటుంది. ఇలా చపాతీలో అనేక రకాల పోషకాలు ఉన్నప్పటికి వీటిలో ప్రోటీన్ చాలా తక్కువగా ఉంటుంది. అయితే కింద చెప్పిన చిట్కాలను పాటించడం వల్ల చపాతీని కూడా మనం సంపూర్ణ ఆహారంగా తయారు చేసుకోవచ్చు. దీనిలో ప్రోటీన్ శాతంతో పాటు ఇతర పోషకాల శాతాన్ని కూడా పెంచుకోవచ్చు. చపాతీని మరింత ఆరోగ్యకరంగా మార్చుకోవచ్చు. చపాతీలోప్రోటీన్ శాతాన్ని పెంచడంతో పాటు దానిని సంపూర్ణ ఆహారంగా ఎలా మార్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చపాతీని తయారు చేసేటప్పుడు వెన్న లేదా నెయ్యి వేసి కాల్చుకోవాలి. నెయ్యి లేదా వెన్న వేయడం వల్ల చపాతీలో ఉండే పోషకాల శాతం పెరుగుతుంది. ప్రాసెస్డ్ చేసిన నూనెను వేసి చపాతీని కాల్చకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. అలాగే చపాతీలో ప్రోటీన్ శాతాన్ని పెంచడానికి పనీర్ తో లేదా చీజ్ తో తయారు చేసుకోవాలి. పనీర్ లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. పనీర్ వాడడం వల్ల చపాతీ మరింత మెత్తగా, రుచిగా ఉంటుంది. అలాగే శరీరానికి కావల్సిన ప్రోటీన్ కూడా లభిస్తుంది. అలాగే చపాతీని సంపూర్ణ ఆహారంగా మార్చడానికి ఇందులో ఇతర చిరుధాన్యాల పిండిని కలపాలి. గోధుమపిండితో రాగిపిండి, జొన్న పిండి వంటి వాటిని చేర్చి చపాతీలు తయారు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చపాతీలు శరీరానికి మరింత మేలు చేసేలా తయారవుతాయి.
ఇలా తయారు చేసిన చపాతీలల్లో ఫైబర్ తో ఇతర పోషకాల విలువలు కూడా పెరుగుతాయి. అదే విధంగా చపాతీ పిండిలో మెంతికూర, పాలకూర, బచ్చలికూర వంటి ఆకుకూరలను కలిపి ఆ పిండితో చపాతీలను తయారు చేసుకోవాలి. అలాగే కూరగాయలతో స్టఫింగ్ చేసుకుని తయారు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చపాతీల రుచి పెరగడంతో పాటు మన ఆరోగ్యానికి మరింత మేలు చేసేలా తయారవుతాయి. ఈ విధంగా చేయడం వల్ల చపాతీలు మరింత రుచిగా ఉండడంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి.