గ్రీన్ టీని రోజూ తాగడం వల్ల అద్భుతమైన ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. గ్రీన్ టీని తాగితే అధిక బరువు తగ్గుతారు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇంకా ఎన్నో లాభాలు ఉంటాయి. అయితే గ్రీన్ టీ మనకు ఆరోగ్యకరమైనదే అయినప్పటికీ దాన్ని రోజూ ఎక్కువగా తాగరాదు. రోజుకు పరిమిత మోతాదులోనే గ్రీన్ టీని తాగాల్సి ఉంటుంది.
గ్రీన్ టీని అధికంగా తాగితే శరీరంపై దుష్ప్రభావాలను చూపిస్తుంది. గ్యాస్, అసిడిటీ పెరుగుతాయి. నిద్రలేమి సమస్య వస్తుంది. గుండె అసాధారణ రీతిలో కొట్టుకుంటుంది. కనుక గ్రీన్ టీని రోజూ పరిమిత మోతాదులోనే తాగాల్సి ఉంటుంది.
సైంటిస్టులు చెబుతున్న ప్రకారం రోజుకు రెండు నుంచి మూడు కప్పుల గ్రీన్ టీని తాగవచ్చు. అంతకు మించి తాగితే ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలగకపోగా అనారోగ్య సమస్యలు వస్తాయి. కనుక గ్రీన్ టీని ఎక్కువగా సేవించే వారు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవడం మంచిది.