Sleep : మీ వ‌య‌స్సు ప్ర‌కారం మీరు రోజూ ఎన్ని గంట‌ల‌పాటు నిద్రించాలో తెలుసా..?

Sleep : మ‌న శ‌రీరానికి ఆహారం, నీరు ఎలాగో నిద్ర కూడా అంతే అవ‌స‌రం. మ‌న శ‌రీరానికి త‌గినంత నిద్ర ఉన్న‌ప్పుడే మ‌నం ఉత్సాహంగా ప‌ని చేసుకోగ‌లుగుతాము. మ‌నం నిద్రించేట‌ప్పుడు మ‌న శ‌రీరంలో అనేక విధులు జ‌రుగుతాయి. మ‌న శ‌రీరంలో త‌గినంత అవ‌య‌వాల‌కు విశ్రాంతి ల‌భిస్తుంది. దీంతో ఈ అవ‌య‌వాలు మ‌రుస‌టి రోజూ వాటి విధుల‌ను స‌క్రమంగా నిర్వర్తిస్తాయి. అలాగే నిద్రించ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరం త‌న‌ని తాను శుభ్రం చేసుకుంటుంది. శ‌రీరంలో ఉండే వ్య‌ర్థాలు బ‌య‌ట‌కు పోతాయి. శ‌రీరంలో డిటాక్సిఫికేష‌న్ ప్ర‌క్రియ స‌మ‌ర్థ‌వంతంగా జ‌రుగుతుంది. రోజూ త‌గినంత నిద్రించ‌క‌పోవ‌డం వ‌ల్ల మ‌నం తీవ్ర అనారోగ్యానికి గురి కావాల్సి వ‌స్తుంది.

నేటి త‌రుణంలో చాలా మంది నిద్ర‌లేమి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. కొంద‌రు 4 లేదా 5 గంట‌లు నిద్రిస్తూ ఉంటారు. కొంద‌రు పిల్ల‌లు కూడా చాలా త‌క్కువ స‌మ‌యం నిద్రిస్తూ ఉంటారు. పిల్ల‌లు త‌క్కువ స‌మ‌యం నిద్రించ‌డం వ‌ల్ల వారిలో ఎదుగుద‌ల త‌క్కువ‌గా ఉంటుంద‌ని నిపుణులు కూడా చెబుతున్నారు. క‌నుక పిల్ల‌లు కూడా వారి వ‌య‌సుకు త‌గిన‌ట్టు త‌గినంత స‌మ‌యం నిద్రించ‌డం చాలా అవ‌స‌రం. మ‌న‌లో చాలా మందికి ఎంత స‌మ‌యం నిద్రించాలో కూడా తెలియ‌దు. మ‌నం మ‌న వ‌య‌సును బ‌ట్టి నిద్రించాల్సి ఉంటుంది. వ‌య‌సును బ‌ట్టి మ‌నం ఎంత స‌మ‌యం నిద్రించాలో ఇప్పుడు తెలుసుకుందాం. అప్పుడే పుట్టిన పిల్ల‌ల నుండి 3 నెల‌ల శిశువు వ‌ర‌కు రోజూ 14 నుండి 17 గంట‌ల స‌మ‌యం వ‌ర‌కు నిద్రించాలి.

how many hours of sleep do you require daily by your age
Sleep

అలాగే 4 నెల‌ల నుండి 11 నెల‌ల పిల్ల‌ల వ‌ర‌కు రోజూ 12 నుండి 15 గంట‌లు నిద్ర‌పోవాలి. ఒక సంవ‌త్స‌రం నుండి 2 సంవ‌త్స‌రాల వ‌ర‌కు రోజూ 11 నుండి 14 గంట‌లు నిద్ర‌పోవాలి. ఇక‌ నుండి 5 సంవ‌త్స‌రాల పిల్ల‌లకు రోజూ 10 నుండి 13 గంట‌ల నిద్ర అవ‌స‌రమ‌వుతుంది. అలాగే 6 నుండి 13 ఏళ్ల వ‌య‌సు పిల్ల‌లు 9 నుండి 11 గంట‌లు నిద్ర‌పోవాలి. ఒక 14 నుండి 17 సంవ‌త్స‌రాల వారు 8 నుండి 10 గంట‌లు నిద్ర‌పోవాలి. 18 నుండి 25 సంవత్స‌రాల వారు రోజూ 7 నుండి 9 గంట‌లు నిద్ర‌పోవాలి. 26 నుండి 64 సంవ‌త్స‌రాల వారు రోజూ 7 నుండి 9 గంట‌లు నిద్ర‌పోతే స‌రిపోతుంది. ఇక 64 సంవ‌త్స‌రాలు పైబ‌డిన వారు 7 నుండి 8 గంట‌లు నిద్ర‌పోవాలి. ఇలా మ‌న వ‌య‌సుకు తగ్గినట్టు మ‌నం నిద్ర‌పోయిన‌ప్పుడే మ‌న ఆరోగ్యానికి మేలు క‌లుగుతుంద‌ని పిల్ల‌ల్లో అయితే ఎదుగుద‌ల చ‌క్క‌గా ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

Share
D

Recent Posts