Salt Side Effects : ఉప్పుని ఎక్కువగా తీసుకుంటే, ముప్పు తప్పదు. ఆరోగ్య నిపుణులు ఉప్పుని అధికమ మోతాదులో తీసుకోవద్దని చెప్తూ ఉంటారు. అధిక మోతదలో సాల్ట్ ని తీసుకోవడం వలన, అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. చాలామంది, తెలియక సాల్ట్ విషయంలో పొరపాటు చేస్తుంటారు. అధికమతాలో సాల్ట్ ని తీసుకోవడం వలన, చాలా రకాల ఇబ్బందులు వస్తాయట. ఉప్పును తీసుకోవడం వలన, ఆరోగ్యం పై చెడు ప్రభావం పడుతుంది. అలానే, ఉప్పు తీసుకోవడం వలన మంచి కూడా జరుగుతుంది.
ఫ్లూయిడ్ బ్యాలెన్స్ చేయడానికి, మజిల్ కాంట్రాక్షన్ ఇలా పలు వాటికి, ఉప్పు కచ్చితంగా అవసరం. అయితే, బాగా అధిక మోతాదులో సాల్ట్ ని తీసుకోవడం వలన, హై బీపీ సమస్య వస్తుంది. అలానే, హృదయ సంబంధిత సమస్యలు, స్ట్రోక్ వంటి ఇబ్బందుల్ని ఎదుర్కోవాలి. కాబట్టి, కచ్చితంగా సాల్ట్ ఎంత తీసుకోవాలో అంతే తీసుకోవాలి. రోజు ఎంత సాల్ట్ తీసుకోవాలో తెలుసుకుని, దాని ప్రకారం మీరు సాల్ట్ ని తీసుకుంటే, నష్టాలు ఉండవు. రోజూ 5 గ్రాములకు మించి ఉప్పును తీసుకోకండి.
సాల్ట్ లో 40 శాతం సోడియం, 60 శాతం క్లోరైడ్ ఉంటాయి. ఊరగాయలు వంటి వాటిని పాడైపోకుండా, సాల్ట్ ఉంచుతుంది. బ్యాక్టీరియా సాల్ట్ ఎక్కువగా ఉన్న చోట ఉండదు. అందుకే, ఊరగాయలు వంటి వాటిని సాల్ట్ వేసి, పాడైపోకుండా ఉంచుతారు. పాప్ కార్న్, బటర్, సాసులు, హార్లిక్స్ ఇలాంటి వాటిలో కూడా సాల్ట్ ని వేస్తూ ఉంటారు. అయితే, సాల్ట్ తీసుకోవడం వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కలుగుతాయి అన్నది చూస్తే.. అధిక మోతాదులో సాల్ట్ ని తీసుకోవడం వలన, బీపీ బాగా పెరిగిపోతుంది. కిడ్నీలు మలినాలని బయటికి పంపడం కష్టంగా ఉంటుంది. అధిక మోతాదులో సాల్ట్ ని తీసుకోవడం వలన, నిద్ర కూడా సరిగ్గా పట్టదు.
మధ్య మధ్యలో మెలుకువ వచ్చేయడం వంటివి జరుగుతాయి. ఎక్కువ సాల్ట్ ని తీసుకోవడం వలన, బరువు పెరిగిపోతారు. రోజుకి రెండు పౌండ్లు కంటే బరువు పెరిగిపోతున్నట్లయితే, కచ్చితంగా సాల్ట్ ని తగ్గించండి. వారానికి నాలుగు పౌండ్లు వరకు బరువు పెరిగిపోయే వాళ్ళు కూడా సాల్ట్ ని బాగా తగ్గించాలి. సాల్ట్ బాగా ఎక్కువ తీసుకోవడం వలన, బ్లోటింగ్ సమస్య కూడా వస్తుంది. కాబట్టి, వీలైనంత వరకు సాల్ట్ ని తగ్గించడమే మంచిది. సాల్ట్ ఎక్కువ తీసుకోవడం వలన, దాహం ఎక్కువ వేస్తుంది. దాహం ఎక్కువ వేసినప్పుడు ఎక్కువ నీళ్లు తీసుకుంటూ ఉంటారు. దీంతో ఎక్కువసార్లు యూరిన్ వెళ్లాల్సి ఉంటుంది. ఇలాంటి, ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నట్లయితే ఖచ్చితంగా సాల్ట్ ని తగ్గించాలి.