Kids Immunity : మీ పిల్లల ఇమ్యూనిటీ పవర్‌ను పెంచే.. 9 సూపర్‌ ఫుడ్స్‌.. వీటిని రోజూ పెట్టండి..!

Kids Immunity : ప్రస్తుత తరుణంలో చాలా మంది పిల్లలు కళ్ల కలక బారిన పడుతున్న విషయం విదితమే. వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌ కారణంగా ఇది వస్తోంది. అయితే కళ్ల కలక మాత్రమే కాదు, ఈ సీజన్‌లో ఇంకా పిల్లలకు అనేక ఇతర అనారోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి. వైరల్‌ ఫీవర్‌, దగ్గు, జలుబు, ఇతర జ్వరాలు వస్తుంటాయి. వీటన్నింటి నుంచి తట్టుకోవాలంటే.. పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్‌ను పెంచాలి. ఇందుకు గాను కింద తెలిపే చిట్కాలు ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిని పాటించడం వల్ల పిల్లల్లో ఇమ్యూనిటీ పెరుగుతుంది. దీంతో వారు రోగాల బారిన పడకుండా ఉంటారు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.

పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్‌ను పెంచడంలో పెరుగు ఎంతగానో దోహదపడుతుంది. దీన్ని రోజూ వారికి ఒక కప్పు మోతాదులో ఇవ్వాలి. దీని వల్ల జీర్ణవ్యవస్థలో మంచి బాక్టీరియా పెరుగుతుంది. ఇది ఆరోగ్యాన్ని సంరక్షించడంలో సహాయపడుతుంది. పెరుగును తీసుకోవడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. దీంతో పిల్లలు తినే ఆహారంలో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా శోషించుకుంటుంది. దీని వల్ల పిల్లలకు విటమిన్‌ డి లభిస్తుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచి వ్యాధులను రాకుండా చూస్తుంది. ఇన్‌ఫెక్షన్ల రిస్క్‌ను తగ్గిస్తుంది. అలాగే పెరుగులో పొటాషియం, క్యాల్షియం వంటి పోషకాలు కూడా అధికంగా ఉంటాయి. ఇవి పిల్లల ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. అందువల్ల పెరుగును వారికి రోజూ తినిపించాలి. దీంతో రోగాలు రాకుండా చూసుకోవచ్చు.

how to increase Kids Immunity 9 super foods
Kids Immunity

పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్‌ను పెంచడంలో సిట్రస్‌ ఫ్రూట్స్‌ కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. పుల్లగా ఉండే గ్రేప్‌ ఫ్రూట్‌, ద్రాక్ష, నారింజ, బత్తాయి, నిమ్మ, కివీ, దానిమ్మ.. వంటి పండ్లలో విటమిన్‌ సి అధికంగా ఉంటుంది. అలాగే జామకాయల్లోనూ ఈ విటమిన్‌ అధికంగానే ఉంటుంది. అందువల్ల ఈ పండ్లను పిల్లలకు రోజూ ఇవ్వాలి. దీంతో రోగనిరోధక వ్యవస్థ పటిష్టమవుతుంది. వ్యాధులు రాకుండా ఉంటాయి. వీటిల్లో పొటాషియం, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫాస్ఫరస్‌, మెగ్నిషియం అధికంగా ఉంటాయి. ఇవి పిల్లల ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి.

బ్రొకలీ, పాలకూర, కాలిఫ్లవర్‌, క్యాబేజీ వంటి కూరగాయలను కూడా పిల్లలకు ఇస్తుండాలి. ఇవి వారిలో రోగ నిరోధక శక్తిని అమాంతం పెంచుతాయి. వీటిల్లో విటమిన్లు ఎ, సి, కె, ఐరన్‌, మెగ్నిషియం, కాల్షియం, పొటాషియం అధికంగా ఉంటాయి. అలాగే వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువే. ఇవి ఇమ్యూనిటీ పవర్‌ను పెంచడంలో సహాయ పడతాయి. అదేవిధంగా పిల్లలకు చికెన్‌, మటన్‌, చేపలు, గుడ్లు తదితర ఆహారాలను కూడా ఇస్తుండాలి. వీటిల్లో ఉండే ప్రోటీన్లు తెల్ల రక్త కణాలు పెరగడంలో సహాయం చేస్తాయి. దీంతో రోగాలు రాకుండా ఉంటాయి. ఇన్‌ఫెక్షన్లు రాకుండా చూసుకోవచ్చు. వీటిల్లో జింక్‌, ఐరన్‌, బి విటమిన్లు, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇవి పిల్లలకు పోషణను అందిస్తాయి.

పిల్లలకు బ్లూబెర్రీలు, రాస్ప్‌బెర్రీలు, బ్లాక్‌బెర్రీలు, స్ట్రాబెర్రీలు, క్రాన్‌ బెర్రీలను ఆహారంగా ఇవ్వాలి. ఇవి అనేక పోషకాలను, ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్లను ఎక్కువగా కలిగి ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీ పవర్‌ను అమాంతం పెంచుతాయి. అలాగే పొద్దు తిరుగుడు, గుమ్మడి విత్తనాలు, నువ్వులు, చియా సీడ్స్‌ వంటి విత్తనాలను కూడా పిల్లలకు రోజూ ఇస్తుండాలి. వీటిల్లో ఫైబర్‌, పాలీ అన్‌శాచురేటెడ్‌, మోనో అన్‌శాచురేటెడ్‌ కొవ్వులు, ఇతర సూక్ష్మ పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వీటిల్లో విటమిన్‌ ఇ అధికంగా ఉంటుంది. ఇది పిల్లల ఇమ్యూనిటీని పెంచుతుంది. రక్తసరఫరాను మెరుగు పరుస్తుంది. ఈ విత్తనాలను పిల్లలకు రోజూ రెండు టీస్పూన్ల మోతాదులో పెనంపై కాస్త వేయించి ఇవ్వవచ్చు.

పిల్లల ఇమ్యూనిటీ పవర్‌ పెరగాలంటే ఇవ్వాల్సిన ఆహారాల్లో ఓట్స్‌ కూడా ఒకటి. వీటిల్లో ఫైబర్‌, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్‌ అధికంగా ఉంటాయి. ఇవి పిల్లలను ఇన్‌ఫెక్షన్ల బారి నుంచి రక్షిస్తాయి. కనుక ఓట్స్‌ను రోజూ వారికి తినిపించాలి. అలాగే రోజూ పిల్లలకు ఒక కోడిగుడ్డును ఉడకబెట్టి ఇవ్వాలి. దీని వల్ల రోగ నిరోధక శక్తి అధికంగా పెరుగుతుంది. కోడిగుడ్లలో విటమిన్‌ డి, విటమిన్ ఎ, బి12 అధికంగా ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీ పవర్‌ను పెంచి రోగాలు రాకుండా చూడడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. కనుక పిల్లలకు రోజూ ఒక గుడ్డు ఇవ్వాలి.

రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాల్లో పసుపు కూడా ఒకటి. దీన్ని భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచే ఉపయోగిస్తున్నారు. దీన్ని రోజూ వంటల్లో వేస్తుంటారు. ఇది పిల్లల ఇమ్యూనిటీని అధికంగా పెంచుతుంది. పిల్లలకు రోజూ ఒక గ్లాస్‌ పాలలో కాస్త పసుపు కలిపి ఇస్తుండాలి. పసుపులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ ఆక్సిడెంట్‌, యాంటీ మైక్రోబియల్‌ గుణాలు రోగాలు రాకుండా చూస్తాయి. అందువల్ల పసుపును కూడా పిల్లలకు రోజూ ఇవ్వాలి. ఇక పిల్లలకు ఇవే కాకుండా విటమిన్లు సి, డి, ఎ, జింక్‌ ఉండే ఆహారాలను అధికంగా ఇస్తుండాలి. దీని వల్ల వారిలో ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. వారు రోగాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటారు.

Editor

Recent Posts