మీయొక్క మైండ్ మరియు బాడీ రెండూ కనీసం రోజుకు ఒకసారైనా రిలాక్సేషన్ పొందాలి. ఆరోగ్యవంతమైన జీవనానికి మీకు కొన్ని వ్యాయామాలు అవసరం. అయితే అవి ఎంతో శ్రమించి చెమట పట్టేవిగా వుండనవసరం లేదు. సామాన్యమైన బ్రీతింగ్ ఎక్సర్ సైజెస్ మీరు బస్సులో ప్రయాణిస్తున్నా లేదా ఆఫీసుల్లో వున్నా ఏ రకంగా చేయవచ్చో పరిశీలిద్దాం. ఈ బ్రీతింగ్ వ్యాయామలు ఆచరించేవారికి మంచి ఆరోగ్యం వుంటుంది. దీర్ఘశ్వాస లోపలికి తీసుకుంటే కావలసినంత ఆక్సిజన్ లోపలికి పోతుంది. గాలిలోని కలుషితమంతా తొలగించబడుతుంది కనుక ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడమే మంచిది.
దీర్ఘ శ్వాస ప్రయోజనాలు- -ఊపిరితిత్తుల సామర్ధ్యం పెరుగుతుంది. -దీర్ఘ శ్వాసలు అధిక ఆక్సిజన్ లోనికి తీసుకొని రక్త సరఫరా సాఫీగా జరిగేలా చేస్తాయి. -ఆహారం త్వరగా జీర్ణమై తక్షణ శక్తి వస్తుంది. -బ్రెయిన్ చురుకుగా పనిచేసి హాయిగా వుంటుంది. -మైండ్ ఎల్లపుడూ విశ్రాంతిగా వుంటూ విచారమనేది వుండదు. దీర్ఘ శ్వాసకు చిట్కాలు- -సరియైన శ్వాస అంటే….మీ పొట్ట భాగం గాలిపీల్చినపుడు ఛాతీ కంటే పైకి రావాలి. -ఎపుడు చేయాలనుకున్నా తిన్నగా కూర్చోండి లేదా నిలుచోండి. 1. బస్సు ప్రయాణం లేదా ఆఫీసులలో ఒక ముక్కు రంధ్రంతో గాలి పీల్చటం రెండో ముక్కు రంధ్రంలోంచి వదిలేయటం చేయండి.
2. గాలి గట్టిగా పీల్చి నిలపండి కొద్ది సెకండ్ల తర్వాత వదిలేయండి. 3. తిన్నగా నిలబడి, గాలి గట్టిగా పీల్చి కొద్ది సెకండ్లు నిలిపి క్రింది భాగపు పక్కటెముకలు ముందుకు వెనుకకు ఆడేట్లు చేయండి. అది సరి అయిన టెక్నిక్ కాగలదు. శ్వాస సంబంధిత వ్యాయామాలు ఊపిరితిత్తులకే కాదు మైండ్ కు కూడా చక్కటి రిలాక్సేషన్ ఇస్తాయి.