Nutmeg Powder : భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచే జాజికాయలను ఉపయోగిస్తున్నారు. ఇవి వేడి స్వభావాన్ని కలిగి ఉంటాయి. చక్కన సువాసనను అందిస్తాయి. కనుక వీటిని ఎక్కువగా మసాలా వంటల తయారీల్లో వాడుతారు. ఆయుర్వేద ప్రకారం జాజికాయలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. జాజికాయ వల్ల మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. జాజికాయ పొడిని కాస్త తీసుకుని గోరు వెచ్చని నీటిలో కలిపి తాగితే ఎంతో ప్రయోజనం కలుగుతుందని, అనేక వ్యాధులను తగ్గించుకోవచ్చని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ఈ విధంగా తాగడం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
జాజికాయ పొడిని గోరు వెచ్చని నీటిలో కలిపి తాగితే అనేక లాభాలను పొందవచ్చు. జాజికాయల్లో మన శరీరానికి అవసరం అయ్యే అనేక ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. వీటిల్లో పొటాషియం, క్యాల్షియం, ఐరన్, మెగ్నిషియం, జింక్, కాపర్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి మనల్ని రోగాల బారి నుంచి రక్షిస్తాయి. జాజికాయల్లో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ త్రాంబోటిక్, యాంటీ రుమాటిక్, కార్మినేటివ్ గుణాలు ఉంటాయి. అందువల్ల ఇవి ఎన్నో వ్యాధులను తగ్గించగలవు.
జాజికాయ పొడిని గోరు వెచ్చని నీటిలో కలిపి తాగితే జీర్ణక్రియ మెరుగు పడుతుంది. దీంతోపాటు కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం నుంచి తక్షణమే ఉపశమనం లభిస్తుంది. నిద్రలేమి సమస్య అనేది ప్రస్తుతం చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తోంది. అలాంటి వారు జాజికాయ పొడిని రోజూ ఇలా తీసుకుంటే చాలు, ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మనస్సు ప్రశాంతంగా మారుతుంది. దీంతో నిద్ర చక్కగా పడుతుంది. పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటారు. నిద్రలేమి సమస్య నుంచి బయట పడవచ్చు.
జాజికాయ పొడితో దంతాలను కూడా శుభ్రం చేసుకోవచ్చు. దీంతో దంతాలు, చిగుళ్లు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. దంతాలు, చిగుళ్ల నొప్పి తగ్గుతుంది. పుచ్చు పన్ను సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. నోట్లోని బాక్టీరియా నశించి నోటి దుర్వాసన తగ్గుతుంది. ఈ పొడిని ఫేస్‌ప్యాక్‌గా వాడితే ముఖం కాంతివంతంగా మారి మెరిసిపోతుంది. దీంతోపాటు శరీరంపై ఎక్కడైనా రాస్తే వాపులు, నొప్పులు, దురదలు తగ్గిపోతాయి. జాజికాయ పొడిని తీసుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగు పడుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా చూసుకోవచ్చు. షుగర్, కొలెస్ట్రాల్ తగ్గుతాయి.
ఈ పొడి డిప్రెషన్‌కు మంచి మందుగా పనిచేస్తుంది. కనుక జాజికాయ పొడిని రోజూ తీసుకోవాలి. అయితే ఈ పొడి కొందరికి పడదు. దీన్ని తీసుకుంటే కొందరికి కడుపులో మంట లేదా విరేచనాలు అవడం వంటి సమస్యలు ఎదురవచ్చు. కనుక అలాంటి వారు వెంటనే ఈ పొడిని తీసుకోవడం మానేయాల్సి ఉంటుంది.