హెల్త్ టిప్స్

వేడి వేడి కాఫీ తాగేస్తున్నారా…? ఆగండి ఆగండి ఇది చదవండి ముందు…!

కాఫీ” మనిషి గాలి పీల్చడం ఎలాగో ఒకరకంగా కాఫీ తాగడం కూడా అలాగే. కాసేపు గాలి పీల్చకుండా అయినా బిగపట్టుకుని ఉంటారు ఏమో గాని రెండు నిమిషాలు కాఫీ ఆలస్యం అయితే మాత్రం గగ్గోలు పెట్టేసి, ఇల్లాలు అయితే ఇల్లాలు, ఆఫీస్ స్టాఫ్ అయితే స్టాఫ్. వాళ్ళ మీద విరుచుకుపడిపోయి నానా మాటలు అనేస్తారు. ఒకరకంగా చాలా మందికి కాఫీ అనేది జీవితంలో ఒక భాగంగా మారిపోయింది మరి.

మళ్ళీ ఆ కాఫీ చల్లబడినా సరే కస్సుమని లేచి తిట్టేస్తారు. వెధవ గోల అంటూ నోరేసుకుని పడిపోతారు. అసలు అది మంచిది కాదంటున్నారు పరిశోధకులు. వేడి వేడి కాఫీ అనేది ఎంత మాత్రం మంచిది కాదని అంటున్నారు. నిజం సామీ… ఇది చదవండి. చైనాలో ఇటీవల ఒక పరిశోధన చేసారు. మందు, పొగ తాగడంతో పాటుగా టీ కాఫీలను అతి వేడిగా తాగితే మీ ప్రాణం మీదకు వచ్చేస్తుంది అంటున్నారు. ఒకరిద్దరి మీద చేసిన సర్వే కాదండి…

if you are drinking hot coffee then know this

దాదాపు 4 లక్షల మందితో సర్వే చేసి ఆ విషయాన్ని చెప్పారు. ఇంతకు ప్రాణం మీదకు ఎం వస్తుంది అంటారా…? అన్న వాహిక క్యాన్సర్ ఉంది కదా…? ఆ రిస్క్ జస్ట్ ఐదు రెట్లు ఎక్కువగా ఉంటుంది అంటున్నారు. 30 ఏళ్ళ నుంచి 79 ఏళ్ళ వయసున్న వారిలో చేసారు ఇది. రోజు వేడి వేడిగా తాగేస్తున్న వారిలో క్యాన్సర్ అవకాశాలు పెరిగాయని, వేడి వేడిగా పానియాల తాగడం వలన అన్నవాహిక కణాలు డ్యామేజ్ అవుతున్నాయని, క్యాన్సర్ కణాలు ఏర్పడటానికి దోహద౦ చేస్తున్నాయట.

Admin

Recent Posts