Foods : సమయానికి సరైన ఆహారం తీసుకోవడం వల్ల మానసికంగా, శారీరకంగా మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ ప్రస్తుత కాలంలో మనలో చాలా మంది అస్థవ్యస్థమైన జీవన విధానాన్ని అవంలభిస్తున్నారు. ఈ జీవన విధానం మన ఆహారపు అలవాట్లపై మనం తీసుకునే ఆహారంపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ ఉరుకుల పరుగుల జీవన విధానంలో చాలా మంది ఉదయం పూట పరగడుపున ఏది పడితే అది తినేస్తున్నారు. ఉదయం పూట అల్పాహారం తీసుకోవడం చాలా అవసరం. అవసరం కదా అని ఏది పడితే అది తినకూడదు. ఉదయం పూట తీసుకునే ఆహారం చక్కగా జీర్ణమవుతుంది. దీంతో మనం తీసుకునే ఆహారంలోని పోషకాలు శరీరానికి చక్కగా అందుతాయి.
కనుక ఉదయం పూట మనం చక్కటి ఆహారాన్ని తీసుకోవాలి. ఉదయం పూట పరగడుపున కొన్ని రకాల ఆహారాలను అస్సలు తీసుకోకూడదు. వీటిని తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ అస్థవ్యవస్థమై అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కనుక ఉదయం పూట పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఉదయం పూట తీసుకోకూడని ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చాలా మంది డైట్ లో భాగంగా ఉదయం పూట పరగడుపున పండ్ల రసాలను తీసుకుంటూ ఉంటారు. పండ్ల రసాలను తీసుకోవడం వల్ల జీర్ణ రసాలను తయారు చేసే క్లోమం పై అధిక ఒత్తిడి పడుతుంది. అలాగే వీటిలో ఉండే ప్రక్టోజ్ అనే చక్కెర కాలేయం మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. అలాగే పరగడుపున పండ్ల రసాలను తీసుకోవడం వల్ల షుగర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక పరగడుపున పండ్ల రసాలను తీసుకోకపోవడమే మంచిది.
ఉదయం అల్పాహారం చేసిన తరువాత ఈ పండ్ల రసాలను తీసుకోవడం మంచిది. అలాగే చాలా మంది ఉదయం పూట ఖాళీ కడుపున పండ్లను తింటూ ఉంటారు. పండ్లను తినడం మంచిదే అయినప్పటికి సిట్రస్ జాతికి చెందిన పండ్లను మాత్రం పరగడుపున తీసుకోకూడదు. వీటిని తీసుకోవడం వల్ల పొట్టలో యాసిడ్లు ఎక్కువగా తయారవుతాయి. దీంతో అల్సర్లు, గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కనుక ఉదయం పూట జామ, నారింజ వంటి సిట్రస్ పండ్లను తినకూడదు. అలాగే ఉదయం పూట పరగడుపున సలాడ్ లను ఎక్కువగా తింటూ ఉంటారు. వీటిని తినడం వల్ల వీటిలో ఫైబర్ లు జీర్ణాశయం పై అధిక ఒత్తిడిని కలిగిస్తాయి. దీంతో కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంది. సలాడ్ లను భోజనం చేసిన తరువాత తినడంమంచిది. అలాగే మనలో చాలా మందికి ఉదయం పూట ఖాళీ కడుపున టీ, కాఫీలను తాగే అలవాటు ఉంది.
నిద్ర లేవగానే టీ, కాఫీలను తాగడమనేది మంచి పద్దతి కాదు. వీటిని తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అలాగే జీర్ణవ్యవస్థ పని తీరు దెబ్బతినే అవకాశం ఉంది. కనుక పరగడుపున టీ, కాఫీలను తీసుకోకూడదు. అలాగే పరగడుపున పెరుగు వంటి పదార్థాలను తీసుకోకూడదు. పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ అనే బ్యాక్టీరియా పొట్టలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ స్థాయిలను పెంచి ఎసిడిటీ దారి తీస్తుంది. కనుక ఖాళీ కడుపున పాలతో పులియబెట్టి చేసే పదార్థాలను తీసుకోకపోవడమే మంచిది. ఇలాంటి ఆహారాలను మధ్యాహ్నం లేదా సాయంత్రం తీసుకోవడం ఉత్తమం. ఉదయం పూట శరీరానికి ఎక్కువగా శక్తిని, పోషకాలను అందించే ఆహారాలను తీసుకోవడం మంచిది.