కొంతమంది మంచం ఎంత మృదువుగా ఉన్నా , నేలపై పడుకోవడానికి ఇష్టపడతారు. పగలు లేదా రాత్రి అనే తేడా లేకుండా నేలపై హాయిగా నిద్రపోవడాన్ని మనం చాలా సార్లు చూసే ఉంటాం. చూశాము. ముఖ్యంగా వేసవిలో ప్రతి ఒక్కరి ఇంట్లోనూ అలాంటి అలవాట్లను అలవర్చుకున్న వ్యక్తులు ఉండనే ఉంటారు. కొంతమందికి మంచం మీద పడుకున్నప్పుడు చేతులు, కాళ్ళలో నొప్పి వస్తుంది. కాబట్టి ఇలాంటివారు నేలపై హాయిగా నిద్రపోవాలని కోరుకుంటారు. కానీ ఇది మంచి అలవాటేనా? కాదా? అనేది అందరినీ వేధించే ప్రశ్న. నిపుణులు ఏం చెబుతున్నారంటే..
నేల ఉపరితలం శరీరానికి సహజ శక్తిని అందిస్తుంది. ఈ రకమైన అభ్యాసం వెన్నెముకను బలోపేతం చేయడానికి, వెన్నునొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది. అదనంగా, ఇది శరీరానికి విశ్రాంతిని ఇవ్వడం ద్వారా అలసటను తగ్గిస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. నిద్రలేమి వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. సాధారణంగా మనం నేలపై పడుకున్నప్పుడు, మన శరీరం నిటారుగా ఉంటుంది. ఇది శరీరాన్ని సడలించడమే కాకుండా కండరాలను కూడా సడలిస్తుంది. నొప్పి క్రమంగా తగ్గుతుంది. కాబట్టి దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.
నేలపై, ముఖ్యంగా మట్టిపై పడుకోవడం వల్ల మనస్సులోని ఆందోళన, చింతలు తగ్గుతాయి. చెడు ఆలోచనలు మనసులోకి రావు. బంకమట్టి నేలలపై పడుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. అలాగే, రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటుంది. వేసవిలో నేలపై పడుకోవడం వల్ల శరీరం చల్లబడుతుంది. మట్టికి చల్లబరిచే గుణం ఉన్నందున, అది శరీర వేడిని నెమ్మదిగా తగ్గించడం ద్వారా శరీరాన్ని చల్లబరుస్తుంది. అదనంగా ఈ పద్ధతి గాఢ నిద్రను కూడా తెస్తుంది. మీరు మీ శరీరంలోని వివిధ భాగాలలో నొప్పితో బాధపడుతుంటే నేలపై పడుకోవడం మంచి పరిష్కారం. నేలపై పడుకోవడం వల్ల ఏకాగ్రత కూడా పెరుగుతుంది. ముఖ్యంగా బంకమట్టి నేల ఆరోగ్యానికి మంచిది.
మట్టి నేలపై పడుకోవడం ఆరోగ్యానికి మంచిది. కానీ కొంతమంది గ్రానైట్ మీద పడుకోవడం ఇష్టపడతారు. ఇది కొంతమంది శరీరానికి మంచిది కాదు. దీనివల్ల మోకాళ్ల నొప్పులు, పాదాలలో వాపు వస్తుంది. అలాంటి అలవాటు శరీర నొప్పులను పెంచుతుంది. కానీ వేసవి రోజుల్లో మట్టి నేలపై పడుకోవడం శరీరానికి చాలా మంచిది.