Honey : సహజంగానే చాలా మంది ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో తేనెను కలిపి తాగుతుంటారు. అయితే ఇది బరువు తగ్గడానికి మాత్రమే ఉపయోగపడుతుందనుకుంటారు. కానీ దీని వల్ల శరీరానికి ఎన్నో ఉపయోగాలు కలుగుతాయి. నిజానికి ఉదయాన్నే ఇలా తాగడం శరీరానికి చాలా మంచిది. చక్కెర కన్నా రెండు రెట్లు ఎక్కువ తీపిగా ఉండే తేనె క్రిమి సంహారక గుణాలను కలిగి ఉంటుంది. కనుక గోరు వెచ్చని నీటిలో తేనెను కలిపి రోజూ తాగాలి.
ఇక స్వచ్ఛమైన తేనెను సేవించడం వల్ల ఆరోగ్యంతోపాటు అందాన్ని కూడా పొందవచ్చు. స్వచ్ఛమైన తేనెలో ఎంజైమ్‌లు అధికంగా ఉంటాయి. అలాగే విటమిన్లు, ఖనిజాలతోనూ తేనె నిండి ఉంటుంది. హానికరమైన బాక్టీరియా నుండి మన శరీర వ్యవస్థను రక్షించడంలో తేనె కీలక పాత్ర పోషిస్తుంది. గుండె జబ్బులు ఉన్నవారు తేనెని వాడటం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. భవిష్యత్తులో సమస్యలు రాకుండా ఉంటాయి.
ఇక తేనెను తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక వ్యవస్థ పటిష్టంగా మారుతుంది. అయితే తేనె వాడితే షుగర్ పెరుగుతుందనేది కేవలం అపోహ మాత్రమే. వాస్తవానికి మధుమేహ సమస్యతో ఇబ్బంది పడేవారు కూడా తేనెని వాడవచ్చు. దీని వల్ల ఎలాంటి హాని కలగదు. అలాగే మెదడు పని తీరు మెరుగుపడడానికి కూడా తేనె బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు సహాయపడుతుంది. దీంతోపాటు మలబద్దకం, అజీర్ణం, కడుపునొప్పి ఇలా అనేక సమస్యలకు తేనె చక్కని ఔషధంగా పనిచేస్తుంది. కనుక దీన్ని రోజూ తీసుకోవాలి. దీంతో ఎన్నో లాభాలను పొందవచ్చు.