Room Heater : రూమ్ హీట‌ర్‌ను అతిగా వాడుతున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..!

Room Heater : చ‌లికాలంలో ఉష్ణోగ్ర‌త‌లు చాలా త‌క్కువ‌గా ఉంటాయి. దీంతో చ‌లి నుండి ర‌క్షించుకోవ‌డానికి మ‌న‌లో చాలా మంది గ‌దిలో హీట‌ర్ల‌ను ఉంచుతూ ఉంటారు. ఇలా గ‌దిలో హీట‌ర్ల‌ను ఉంచ‌డం వ‌ల్ల ఉష్ణోగ్ర‌త పెరుగుతుంది. చ‌లి నుండి మ‌న‌కు ర‌క్ష‌ణ ల‌భిస్తుంది. హీట‌ర్ల‌ను వాడ‌డం వ‌ల్ల మ‌న‌కు చ‌లి నుండి చ‌క్క‌టి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. అయితే అతిగాహీట‌ర్ల‌ను వాడ‌డం వ‌ల్ల మ‌నం అనేక దుష్ప్ర‌భావాల‌ను ఎదుర్కొవాల్సి వ‌స్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు. హీట‌ర్ల‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల ముఖ్యంగా పెద్ద ప‌రిమాణంలో ఉన్న హీట‌ర్ల‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల గాల్లో కార్బ‌న్ మోనాక్సైడ్ మ‌రియు నైట్రోజ‌న్ డ‌యాక్సైడ్ పొగ‌లు పెరుగుతాయి. దీంతో జ‌లుబు, త‌ల‌నొప్పి, ఫ్లూ, క‌ళ్లు, ముక్కు మ‌రియు గొంతులో చికాకుగా ఉండ‌డం వంటి అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి.

అలాగే హీట‌ర్ల నుండి వ‌చ్చే పొడి గాలి కార‌ణంగా చ‌ర్మం పొడిబార‌డం, క‌ళ్లు పొడిబార‌డం, చ‌ర్మంపై దద్దుర్లు, ముక్కు నుండి ర‌క్తం కార‌డం వంటి స‌మ‌స్య‌ల బారిన ప‌డాల్సి వ‌స్తుంది. అలాగే నిర్వ‌హ‌ణ లేని హీట‌ర్ల కార‌ణంగా ఇంట్లో అగ్ని ప్ర‌మాదాలు క‌లిగే అవ‌కాశం ఉంది. క‌నుక మంటలు వ్యాపించ‌ని చోట ఈ హీట‌ర్ల‌ను ఉంచాలి. అలాగే నిర్వ‌హ‌ణ లేని హీట‌ర్లు విద్యుత్ షాక్ ల‌కు దారి తీసే అవ‌కాశం కూడా ఉంది. క‌నుక హీటర్ల వైర్లు స‌రిగ్గా ఉన్నాయ లేదా అని త‌రుచూ ప‌రీక్షించుకుంటూ ఉండాలి. అలాగే గ‌దిలో ఉంచే హీట‌ర్లు, గ్యాస్ మ‌రియు కిరోసిన్ తో న‌డిపే హీట‌ర్లు నైట్రోజ‌న్ ఆక్సైడ్ మ‌రియు స‌ల్ప‌ర్ డ‌యాక్సైడ్ వంటి వాయువుల‌ను గాల్లోకి వ‌దులుతాయి. ఈ వాయువుల కార‌ణంగా తీవ్ర‌మైన శ్వాస కోస స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంది.

if you are using room heater then beware
Room Heater

అలాగే ఈ వాయువులు ఉబ్బ‌సం, అల‌ర్జీ వంటి శ్వాస స‌మ‌స్య‌ల‌ను మ‌రింత తీవ్ర‌త‌రం చేస్తాయి. అదే విధంగా హీట‌ర్ల‌ను వాడ‌డం వాటి నుండి వ‌చ్చే పొడి గాలి కార‌ణంగా క‌ళ్లు ఎర్ర‌గా మార‌డం, కంటిలో దుర‌ద వంటి స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొవాల్సి వ‌స్తుంది. అలాగే హీట‌ర్ల‌ను వాడ‌డం వ‌ల్ల విద్యుత్ వినియోగం ఎక్కువ‌వుతుంది. క‌రెంట్ బిల్లులు ఎక్కువ‌గా వ‌స్తాయి. క‌నుక త‌క్కువ విద్యుత్ వినియోగం ఉండే హీట‌ర్ల‌ను ఎంచుకోవ‌డం మంచిది. అదే విధంగా త‌రుచూ హీట‌ర్ల‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల ఇంట్లో గాలి నాణ్య‌త తగ్గుతుంది. క‌నుక ఇంట్లోకి వెంటిలేష‌న్ అయ్యేలా చూసుకోవాలి. అలాగే హీట‌ర్ల‌ల‌ల్లో ఉండే గాలిని శుభ్ర‌ప‌రిచే ఫిల్ట‌ర్ ను త‌రుచూ శుభ్రం చేస్తూ ఉండాలి. ఈ విధంగా హీట‌ర్ల‌ను అతిగా వాడ‌డం వ‌ల్ల అనేక దుష్ప్ర‌భావాల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని క‌నుక త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ వీటిని వాడుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts