Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home హెల్త్ టిప్స్

Blood Sugar Levels : షుగ‌ర్ ఉన్న‌వారు వీటిని తింటే ప్ర‌మాదం.. ఏయే ఆహారాల‌ను తినాలంటే..?

Admin by Admin
December 12, 2024
in హెల్త్ టిప్స్, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Blood Sugar Levels : ప్రస్తుతకాలంలో అత్యధికంగా పీడిస్తున్న వ్యాధి మధుమేహం. ఏడాది పొడ‌వునా ప్రతి సీజన్‌లోనూ మధుమేహ వ్యాధిగ్రస్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి. డయాబెటిస్ ఉన్నవారు ఆరోగ్య విషయంలోనూ, తీసుకునే ఆహారం విషయంలోనూ ఎంతో జాగ్రత్త వహించాలి. మీరు తీసుకునే ఆహారమే మీ శరీరంలోని ఇన్సులిన్ స్థాయిల‌ హెచ్చుతగ్గుల‌పై ప్రభావం చూపిస్తుంది. ఆహారంలో నిత్యం పోషకాల‌ను తీసుకోవడం వలన రక్తంలో షుగర్ లెవల్స్ నియంత్రణంలో ఉంటాయి. డయాబెటిస్ పేషెంట్స్ రోజువారీ ఆహారంలో తాజా పండ్లు, కూరగాయలు, ఖనిజాలు, అధిక ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్లు, ప్రోటీన్స్, ఉండేలా తీసుకోవటం ఉత్తమం. అయితే డయాబెటిస్ ఉన్నవారు కొన్ని రకాల ఆహారాలను దూరం పెట్టడం మంచిది. కొన్ని కొన్ని సార్లు మనం తీసుకునే ఆహారం కారణంగా మందులతో నయం చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది.

డయాబెటిస్ ఉన్న వారు చక్కెర అధికంగా ఉండే పండ్లను అసలు తీసుకోకూడదు. డయాబెటిస్ ఉన్నవారు బాగా ఎక్కువ మొత్తంలో పుచ్చకాయలు, అరటి పండ్లు, ఎండు ద్రాక్ష, ఐస్ క్రీం, స్వీట్స్ తీసుకోకూడదు. ఒకవేళ డయాబెటిస్ పేషెంట్స్ పండు తినాలంటే చాలా మితంగా వాటిని తీసుకొనాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఒక అరటి పండు తినాలి అనిపిస్తే దానిలో సగభాగం మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది.

if you have diabetes then do not take these foods

మామిడి, ఖర్బూజా, ద్రాక్షా, సీతాఫలాలు, పైనాపిల్ వంటి వాటిలో చక్కెర స్థాయిలు అధికంగా ఉంటాయి. అందువలన ఈ పండ్లకు దూరంగా ఉండాలి. నూనెలో వేయించిన పదార్థాలు మరియు వండిన ఎర్ర మాంసం, చికెన్ తింటే డయాబెటిస్ పేషెంట్ల‌లో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బార్బెక్యూయింగ్, బ్రాయిలింగ్, గ్రిల్లింగ్, వేయించే పద్దతుల్లో వండిన మాంసం తింటే ఈ ప్రమాదం మరీ ఎక్కువగా ఉంటుంది. అందువలన ఈ ఆహార పదార్థాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిద‌ని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

డయాబెటిస్ పేషెంట్స్ ఎక్కువగా పీచు మరియు మంచి ప్రోటీన్స్ ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. కార్బొహైడ్రేట్స్ ఉన్న పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వలన షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. నిత్యజీవితంలో షుగర్ కంట్రోల్లో ఉంచుకోవాలి అంటే శరీరానికి మంచి పోషకాలు ఇవ్వడం ఎంతో అవసరం. రాగులు, సజ్జలు, అవిసెలు, ఊదలు, సామలు వంటి చిరుధాన్యాలను ఆహారంలో నిత్యం తీసుకోవాలి. చిరుధాన్యాలను అధికంగా తీసుకుంటే జీర్ణశక్తి మెరుగవుతుంది. వీటిలో ఉండే ఎన్నో పోషకాలు గుండెజబ్బులు, డయాబెటిస్‌, రొమ్ము క్యాన్సర్ ల‌ను దరిచేరనివ్వవు. స్త్రీలల్లో వచ్చే మెనోపాజ్ సమస్యల‌ను కూడా అదుపు చేస్తాయి. క‌నుక చిరు ధాన్యాల‌ను ఎక్కువ‌గా తింటే డ‌యాబెటిస్ త‌గ్గ‌డంతోపాటు అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు.

Tags: Diabetes
Previous Post

Vastu Tips : వాస్తు ప్ర‌కారం ఇంట్లో ఈ వ‌స్తువుల‌ను పెట్టండి.. ల‌క్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉంటుంది..!

Next Post

Nail Biting : గోర్లు కొరికే అల‌వాటు ఎంత ప్ర‌మాద‌మో తెలుసా.. ఇవి తెలిస్తే ఇక‌పై అలా చేయ‌రు..!

Related Posts

lifestyle

తొడ‌లు లావుగా ఉన్న‌వారు ఇలాంటి దుస్తుల‌ను ధ‌రిస్తే మంచిది..!

June 3, 2025
హెల్త్ టిప్స్

పాదాల వాపులు ఉన్నాయా.. అయితే ఇలా చేయండి చాలు..

June 3, 2025
వైద్య విజ్ఞానం

ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే అది డీహైడ్రేష‌న్ అన్న‌మాటే.. ఇలా చేస్తే చాలు..!

June 3, 2025
mythology

మంగ‌ళ సూత్రాల‌కు పిన్నీసుల‌ను ఎందుకు పెట్ట‌కూడ‌దు..?

June 2, 2025
ఆధ్యాత్మికం

చిన్న వ‌య‌స్సులోనే పిల్ల‌లు చ‌నిపోతే.. అందుకు కార‌ణం ఎవ‌రు..?

June 2, 2025
ఆధ్యాత్మికం

పూజ చేసిన త‌రువాత క‌ర్పూరం ఎందుకు వెలిగిస్తారు..? దీని వెనుక ఉన్న సైన్స్ ఇదే..!

June 2, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
పండ్లు

అంజీర్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

by Admin
December 6, 2021

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

by Editor
December 25, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!