Papaya : ఈ ఆరోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారు బొప్పాయి పండ్ల‌ను తిన‌కూడ‌దు..!

Papaya : బొప్పాయి పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల ఎన్ని అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. ఈ పండ్లు దాదాపుగా మ‌న‌కు ఏడాది పొడ‌వునా అందుబాటులో ఉంటాయి. అందువ‌ల్ల వీటిని మ‌నం ఎప్పుడైనా స‌రే తిన‌వ‌చ్చు. జ్వ‌రం వ‌చ్చిన వారు బొప్పాయి పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల త్వ‌ర‌గా కోలుకుంటారు. ఈ పండ్ల‌ను తింటే మ‌ల‌బ‌ద్ద‌కం ఉండ‌దు, గ్యాస్‌, అసిడిటీ, అజీర్ణం త‌గ్గుతాయి. బొప్పాయి పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల ప్లేట్‌లెట్లు కూడా పెరుగుతాయి. డెంగ్యూ వ‌చ్చిన వారు ఈ పండ్ల‌ను తింటే త్వ‌ర‌గా కోలుకుంటారు. ఇలా బొప్పాయి పండ్ల‌తో మ‌నకు అనేక లాభాలు క‌లుగుతాయి. అయితే ఈ పండ్ల‌ను కొంద‌రు తిన‌కూడ‌దు.ఇక అతిగా తిన‌డం కూడా మంచిది కాదు. దీని వ‌ల్ల ఏం జ‌రుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

గ‌ర్భంతో ఉన్న మ‌హిళ‌లు బొప్పాయి పండ్ల‌ను తిన‌కూడ‌దు. తింటే అబార్ష‌న్ అయ్యే చాన్స్‌లు ఎక్కువ‌గా ఉంటాయి. క‌నుక గ‌ర్భిణీలు బొప్పాయి పండ్ల‌కు దూరంగా ఉండాలి. అలాగే ఈ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల విట‌మిన్ సి అధిక మొత్తంలో అందుతుంది. అయితే ఈ విట‌మిన్ అధికంగా చేరితే కిడ్నీ స్టోన్స్ ఏర్ప‌డే అవ‌కాశాలు ఉంటాయి. క‌నుక కిడ్నీ స్టోన్లు ఇప్ప‌టికే ఉన్న‌వారు బొప్పాయి పండ్ల‌ను తినే విష‌యంలో డాక్ట‌ర్ స‌ల‌హా తీసుకోవ‌డం మంచిది.

if you have these health problems then do not take Papaya
Papaya

డ‌యేరియా లేదా విరేచ‌నాల స‌మ‌స్య ఉన్న‌వారు ఈ పండ్ల‌ను తిన‌కూడ‌దు. తింటే స‌మ‌స్య మ‌రింత ఎక్కువ‌య్యే అవ‌కాశం ఉంటుంది. అలాగే గుండె జ‌బ్బులు ఉన్న‌వారు డాక్ట‌ర్ స‌ల‌హా మేర‌కు బొప్పాయి పండ్ల‌ను తినాలి. ఈ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల హార్ట్ బీట్‌లో మార్పులు వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది. క‌నుక గుండె జ‌బ్బులు ఉన్న‌వారు డాక్ట‌ర్ సూచ‌న మేర‌కు ఈ పండ్ల‌ను తిన‌డం మంచిది. ఇక థైరాయిడ్ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు కూడా బొప్పాయి పండ్ల‌ను తినే విష‌యంలో జాగ్ర‌త్త వ‌హించాలి. ఇది స‌మ‌స్య‌ను మ‌రింత పెంచేందుకు అవ‌కాశం ఉంటుంది. క‌నుక వీరు డాక్ట‌ర్ సూచ‌న మేర‌కు బొప్పాయి పండ్ల‌ను తినాలి. ఇలా ఆయా ఆరోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారు బొప్పాయి పండ్ల‌ను తినే విష‌యంలో జాగ్ర‌త్త‌ల‌ను పాటించ‌డం మంచిది.

Admin

Recent Posts