Spinach : పాల‌కూర‌తో 7 అద్భుత‌మైన ఉప‌యోగాలు.. ముఖ్యంగా పురుషుల‌కు..!

Spinach : మ‌న‌కు అందుబాటులో ఉన్న వివిధ రకాల ఆకుకూర‌ల్లో పాల‌కూర ఒక‌టి. ఇది మ‌న‌కు ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది. పాల‌కూర‌ను తీసుకోవ‌డం వల్ల అనేక స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. పాల‌కూర జీర్ణ‌క్రియ‌ను మెరుగు ప‌రుస్తుంది. ఇందులో బీటా కెరోటిన్, విట‌మిన్ సి, డి అధికంగా ఉంటాయి. అందువ‌ల్ల పాల‌కూర‌ను తింటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. అలాగే ఇంకా ఎన్నో ర‌కాల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజనాలు మ‌న‌కు పాల‌కూర వ‌ల్ల క‌లుగుతాయి.

7 amazing health benefits of Spinach
Spinach

1. ఆకుకూర‌ల్లో అనేక ర‌కాల పోష‌కాలు ఉంటాయి. ఇక పాల‌కూర విష‌యానికి వ‌స్తే.. ఇందులో మన శ‌రీరానికి కావ‌ల్సిన దాదాపు అన్ని పోష‌కాలు ఉంటాయి. అందువల్ల పోష‌కాహార లోపం స‌మ‌స్య నుంచి సుల‌భంగా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. పాల‌కూర‌లో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముక‌ల‌ను దృఢంగా మారుస్తుంది. మెద‌డును యాక్టివ్‌గా ఉంచుతుంది.

2. పాల‌కూర‌లో ఐర‌న్ అధికంగా ఉంటుంది కనుక దీన్ని తింటే శ‌రీరంలో ర‌క్త‌హీన‌త స‌మ‌స్య త‌గ్గుతుంది. ర‌క్తం బాగా త‌యార‌వుతుంది.

3. పాల‌కూర‌ను జ్యూస్ రూపంలో రోజు ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే ఒక క‌ప్పు మోతాదులో తాగితే అధిక బ‌రువు త‌గ్గుతారు. శ‌రీరంలో ఉండే కొవ్వు క‌రుగుతుంది. బ‌రువు నియంత్ర‌ణ‌లో ఉంటుంది.

4. పాల‌కూర‌లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. క‌నుక శ‌రీరానికి శ‌క్తి బాగా ల‌భిస్తుంది. అలాగే ఇందులో ఉండే ఫ్లేవ‌నాయిడ్స్ శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. దీంతో వ్యాధులు రాకుండా చూసుకోవ‌చ్చు.

5. పాల‌కూర‌లో మెద‌డు ప‌నితీరుకు అవ‌స‌రం అయ్యే పోష‌కాలు అధికంగా ఉంటాయి. అందువ‌ల్ల దీన్ని తింటే మెద‌డు చురుగ్గా మారుతుంది. ఏకాగ్ర‌త‌, జ్ఞాప‌క‌శ‌క్తి పెరుగుతాయి. పిల్ల‌లు చ‌దువుల్లో రాణిస్తారు.

6. పాల‌కూర ర‌క్తాన్ని పలుచ‌గా చేయ‌డంలో స‌హాయ ప‌డుతుంది. శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రా పెరుగుతుంది. దీంతో హార్ట్ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి. జుట్టు, చ‌ర్మం ఆరోగ్యంగా ఉంటాయి.

7. పాల‌కూర‌ను తీసుకోవ‌డం వ‌ల్ల పురుషుల్లో శృంగార సామ‌ర్థ్యం పెరుగుతుంది. దీంతో వారు ఆ కార్యంలో చురుగ్గా పాల్గొంటారు. పాల‌కూర‌ను రోజూ నేరుగా వండుకుని తిన‌వ‌చ్చు. లేదా జ్యూస్ రూపంలో ఒక క‌ప్పు మోతాదులో తాగ‌వ‌చ్చు. సూప్స్‌, స‌లాడ్స్ రూపంలోనూ తీసుకోవ‌చ్చు.

Admin

Recent Posts