Jaggery With Coriander Seeds : మనం బెల్లంతో రకరకాల తీపి వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. బెల్లంతో చేసే తీపి వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే బెల్లం కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో మన శరీరానికి అవసరమయ్యే పోషకాలతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయి. రోజూ ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ బెల్లం ముక్కను ధనియాలతో కలిపి తీసుకోవడం వల్ల మరింత ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. బెల్లాన్ని, ధనియాలను కలిపి తీసుకోవడం వల్ల ఎముకలు ధృడంగా తయారవుతాయి. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు తగ్గడంతో పాటు మరలా రాకుండా ఉంటాయి.
అలాగే బెల్లాన్ని, ధనియాలను తీసుకోవడం వల్ల నోటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. నోటి దుర్వాసన, చిగుళ్లు వాపు, చిగుళ్ల నుండి రక్తం కారటం, చిగుళ్ల నొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి. చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కంటి చూపు మెరుగుపడుతుంది. నేటి తరుణంలో మనలో చాలా మంది మలబద్దకం సమస్యతో బాధపడుతున్నారు. అలాంటి వారు బెల్లాన్ని, ధనియాలను రోజూ రాత్రి పడుకోవడానికి అరగంట ముందు తీసుకోవడం వల్ల మలబద్దకం సమస్య తగ్గుతుంది. అంతేకాకుండా జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. పొట్టకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి. అదే విధంగా రక్తహీనత, రక్తపోటు సమస్యతో బాధపడే వారు బెల్లాన్ని, ధనియాలను కలిపి తీసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.
రోజూ బెల్లాన్ని, ధనియాలను కలిపి తీసుకోవడం వల్ల రక్తం శుద్ది అవుతుంది. శరీరానికి కావల్సిన పోషకాలు లభిస్తాయి. శరీరంలో మెటబాలిజం పెరుగుతుంది. నాడీ మండల వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. హార్మోన్ల అసమతుల్యత వంటి సమస్యలు తగ్గుతాయి. శ్వాస సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. ఈవిధంగా బెల్లాన్ని, ధనియాలను కలిపి తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ బెల్లాన్ని, ధనియాలను ఎంత మోతాదులో తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. రోజూ పావు టీ స్పూన్ బెల్లం తురుములో, అర టీ స్పూన్ ధనియాల పొడిని కలిపి తీసుకోవాలి. అయితే ఇలా తీసుకోవాలనుకునే వారు ఆర్గానిక్ బెల్లాన్ని లేదా నల్ల బెల్లాన్ని ఉపయోగించడం మంచిది.