Immunity Juice : ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటారు. అందుకు మంచి పోషకాహారాన్ని తీసుకుంటూ ఉంటారు. చలి కాలంలో, అనేక రకాల అనారోగ్య సమస్యలు కలుగుతుంటాయి. అలా కాకుండా వాటి నుండి దూరంగా ఉండాలంటే, రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ముఖ్యం. రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి దృష్టి పెట్టాలి. మన ఆరోగ్యం బాగుండాలంటే, వ్యాధితో లేదా ఇన్ఫెక్షన్లతో పోరాడగలరు. వ్యాధులతో పోరాడడానికి రోగనిరోధక శక్తి ఎంతో అవసరం. లేదంటే మన శరీరం తట్టుకోలేదు.
జలుబు, దగ్గు, జ్వరం మొదలైన వాటి వలన ఏ సమస్య లేకుండా ఉండాలంటే, రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. చలి కాలంలో వీటిని తీసుకుంటే, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. నారింజ బాగా సహాయపడుతుంది. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో ఎక్కువగా ఉంటాయి. ఫ్రీ రాడికల్స్ తో పోరాటానికి యాంటీ ఆక్సిడెంట్లు సాయం చేస్తాయి. అలానే క్యారెట్ ని తీసుకుంటే కూడా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. విటమిన్ ఏ, బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో ఎక్కువగా ఉంటాయి.
అలానే, ఆపిల్స్ ని కూడా తీసుకుంటూ ఉండాలి. ఆపిల్స్ వలన కూడా చక్కటి ప్రయోజనాలని పొందొచ్చు. అయితే, చలి కాలంలో మీరు విడివిడిగా కాకుండా వీటన్నిటినీ కలిపి జ్యూస్ కింద చేసుకుని తీసుకోవచ్చు. క్యారెట్, ఆపిల్, నారింజ, నిమ్మకాయ, పసుపు, మిరియాలతో ఈజీగా ఈ జ్యూస్ ని తయారు చేసుకోవచ్చు.
క్యారెట్, ఆపిల్ ని ముక్కలు కింద కోసుకోవాలి. అందులో నారింజ రసం, నిమ్మరసం కలపాలి. నల్ల మిరియాలు, కొంచెం పసుపు వేసి జ్యూస్ కింద చేసుకుని తీసుకోవాలి. ఇలా చేస్తే, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కొలెస్ట్రాల్ తగ్గుతుంది. టాక్సిన్స్ ని బయటికి పంపుతుంది. ఇలా ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. చలి కాలంలో సమస్యలు ఉండవు.