Juices For Anemia : ఈ రెండు జ్యూస్‌ల‌తో మీ ఒంట్లో ర‌క్తం అమాంతంగా పెరుగుతుంది..!

Juices For Anemia : మ‌న‌ల్ని వేధించే అనారోగ్య స‌మ‌స్య‌ల్లో ర‌క్త‌హీన‌త స‌మ‌స్య కూడా ఒక‌టి. పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. ర‌క్త‌హీన‌త స‌మ‌స్య త‌లెత్త‌డానికి వివిధ కార‌ణాలు ఉంటాయి. పోష‌కాలు క‌లిగిన ఆహారాన్ని తీసుకోక‌పోవ‌డం వ‌ల్ల, ప్రేగుల్లో వివిధ ర‌కాల పాములు ఉండ‌డం వ‌ల్ల, మూల శంక‌ వ్యాధుల‌ను క‌లిగి ఉండ‌డం వ‌ల్ల ఈ స‌మ‌స్య త‌లెత్తుతుంది. ముఖ్యంగా స్త్రీల‌ల్లో నెల‌స‌రి కార‌ణంగా, అధిక ర‌క్త‌స్రావం కార‌ణంగా ఈ స‌మ‌స్య త‌లెత్తుతుంది. ఇలాంటి వివిధ కార‌ణాల చేత మ‌న‌లో చాలా మంది ర‌క్త‌హీన‌త స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. ఈ స‌మ‌స్య నుండి వీలైనంత త్వ‌ర‌గా బ‌య‌ట‌ప‌డాలి. లేదంటే మ‌నం వివిధ ర‌కాల‌ అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డాల్సి వ‌స్తుంది.

ఎటువంటి మందులు వాడే అవ‌స‌రం లేకుండా స‌హ‌జ సిద్దంగా కూడా మ‌నం ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. సాధార‌ణంగా స్త్రీల‌ల్లో హిమోగ్లోబిన్ 12 గ్రాముల నుండి 14 గ్రాముల వ‌ర‌కు అదే పురుషుల‌కు 14 గ్రాముల నుండి 16 గ్రాముల వ‌ర‌కు ఉండాలి. ర‌క్తం త‌యార‌వ్వాలంటే మ‌న‌కు ఐర‌న్ ఎంతో అవ‌స‌రం. స్త్రీలకు రోజుకు 30 మిల్లీగ్రాముల ఐర‌న్ అవ‌స‌ర‌మ‌వుతుంది. పురుషులకు రోజుకు 28 మిల్లీ గ్రాముల ఐర‌న్ అవ‌స‌ర‌మ‌వుతుంది. శ‌రీరానికి త‌గినంత ఐర‌న్ అందించ‌డం వ‌ల్ల ఎర్ర ర‌క్త‌క‌ణాలు ఎక్కువ‌గా త‌యార‌వుతాయి. శ‌రీరంలో ఎక్కువ‌గా ర‌క్తం త‌యార‌వ్వాలంటే మ‌నం తీసుకోవాల్సిన ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Juices For Anemia take these two daily
Juices For Anemia

రోజూ ఉద‌యం క్యారెట్ జ్యూస్ ను తీసుకోవాలి. జార్ లో రెండు క్యారెట్ లు, రెండు ట‌మాటాలు, కొద్దిగా బీట్ రూట్, ఒక కీర‌దోస వేసి జ్యూస్ లాగా చేసుకోవాలి. దీనిని వ‌డ‌క్ట‌టి జ్యూస్ ను తీసుకోవాలి. ఇలా త‌యారు చేసుకున్న జ్యూస్ లో ఎండు ఖ‌ర్జూర‌ల పొడి, రెండు టీ స్పూన్ల‌ తేనె వేసి క‌లిపి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల శ‌రీరానికి కావల్సిన ఐర‌న్ తోపాటు ఇత‌ర పోష‌కాలు ల‌భిస్తాయి. దీంతో ర‌క్తం ఎక్కువ‌గా త‌యార‌వుతుంది. వీలైన వారు ఈ జ్యూస్ లో ఒక టీ స్పూన్ గోధుమ గ‌డ్డి పొడిని కూడా వేసుకుని క‌లిపి తాగ‌వ‌చ్చు. ఇక సాయంత్రం 5 గంట‌ల స‌మ‌యంలో ఏదో ఒక పండ్ల ర‌సాన్ని తీసుకోవాలి.

ఇందులో కూడా తేనె, రెండు ఖ‌ర్జూరాల పొడిని వేసి నెమ్మ‌దిగా చ‌ప్ప‌రిస్తూ తాగాలి. అలాగే సాయంత్రం భోజ‌నం స‌మ‌యంలో అన్నానికి బ‌దులుగా 10 ఎండు ఖ‌ర్జూరాలు, అంజీరాలు, ఎండు ద్రాక్ష వంటి వాటిని తీసుకోవాలి. వీటితో పాటు సీజ‌న‌ల్ ప్రూట్స్ ను తీసుకోవాలి. ఇలా తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తం ఎక్కువ‌గా త‌యార‌వుతుంది. వీటితోపాటు ఆకుకూర‌ల‌ను తీసుకోవాలి. ఆకుకూర‌ల్లో ఐర‌న్ ఎక్కువ‌గా ఉంటుంది. రోజూ మ‌ధ్యాహ్నం ఏదో ఒక ఆకు కూర‌ను తీసుకోవాలి. ఎక్కువ‌గా తోట‌కూర‌ను తీసుకునే ప్ర‌య‌త్నం చేయాలి. మందులు వాడే అవ‌స‌రం లేకుండా ఈ విధ‌మైన ఆహారాన్ని ప్ర‌తిరోజూ తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా ర‌క్త‌హీన‌త స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts