కొంతమందికి అప్పుడప్పుడు పాదాలు వాపులు వస్తాయి. అలాగే తిమ్మిరెక్కడం వంటి బాధలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒకవేళ ఇలా జరుగుతున్నట్లయితే.. దీని వెనుక కారణం ఏంటి, ఎందుకు ఇలా జరుగుతోంది అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. పాదాలు తిమ్మిరెక్కినా లేదంటే వాపులు కలిగినా కాస్త జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది. పాదాలకు వాపులు ఎక్కువకాలం పాటు ఉంటున్నట్లయితే హై బీపీ, కిడ్నీ, లివర్, గుండె సమస్యలు ఏమైనా వచ్చి ఉండొచ్చు అని చెప్పడానికి సంకేత., ఎక్కువ శాతం ఫ్లూయిడ్స్ ఒంట్లో స్టోర్ అయిపోయినట్లయితే ఇలా వాపులు కలుగుతాయి. సరిగ్గా బ్లడ్ సర్కిలేషన్ అవ్వక పోయినట్లయితే కూడా ఇలా పాదాలకు వాపులు వస్తాయి.
ఎక్కువ నీళ్లు తాగడం, తక్కువ ఉప్పు తీసుకోవడం, బ్లడ్ సర్కులేషన్ ని ఇంప్రూవ్ చేసుకోవడం వలన కాస్త ఉపశమనం దొరుకుతుంది. ప్రతిరోజు వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన బరువు కలిగి ఉండడం కూడా అవసరం. ఒకవేళ తగ్గకపోతే డాక్టర్ ని కన్సల్ట్ చేయడం మంచిది. కొంతమందికి పాదాలు పగిలిపోతూ ఉంటాయి. అలాంటి వాళ్ళు b2 లోపం ఉండొచ్చు.
గుడ్లు, మాంసం, ఆకుకూరలు తీసుకోవడం వలన ఆ b2 అందుతుంది. మాయిశ్చరైజర్ ని అప్లై చేసుకుంటే కూడా పాదాల పగుళ్లు తగ్గుతాయి. పాదాలు తిమ్మిరి ఎక్కడం b2 లోపానికి కారణం అవ్వచ్చు. b2 సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటే కూడా ఈ సమస్య తగ్గుతుంది. అలాగే ఐరన్ లోపం ఉన్నట్లయితే కూడా పలు సమస్యలు వస్తాయి. కాబట్టి ఇవేమీ లేకుండా ఉండాలంటే మంచి పోషకాహారాన్ని తీసుకోవాలి.