రోజూ ఉదయాన్నే పరగడుపునే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక టీస్పూన్ నిమ్మరసం కలిపి తాగితే అనేక ప్రయోజనాలు కలుగుతాయన్న విషయం విదితమే. ఈ విధంగా తాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. అయితే నిమ్మరసం నీళ్లను ఉదయం తాగితే ఒక విధంగా, రాత్రి తాగితే ఒక విధంగా ప్రయోజనాలను పొందవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
నిమ్మరసం నీళ్లను ఉదయం తాగితే
1. నిమ్మరసం నీళ్లను ఉదయం తాగడం వల్ల డీహైడ్రేషన్ సమస్య బారిన పడకుండా సురక్షితంగా ఉండవచ్చు. శరీరంలో ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి. రోజూ ఎక్కువ సేపు బయట తిరిగే వారికి ఇది మేలు చేస్తుంది. అతి దాహం కాకుండా ఉంటుంది. డీహైడ్రేషన్‌కు గురి కాకుండా ఉంటారు. శరీరంలో ద్రవాలు నిలిచి ఉంటాయి.
2. ఉదయం నిమ్మరసం నీళ్లను తాగితే శరీరానికి శక్తి లభిస్తుంది. ఉత్సాహంగా ఉంటారు. చురుగ్గా పనిచేస్తారు. అలసట అంత త్వరగా రాదు. నీరసం తగ్గుతుంది.
3. ఉదయం నిమ్మరసం నీళ్లను తాగడం వల్ల శరీర మెటబాలిజం పెరుగుతుంది. దీంతో క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. అధిక బరువు తగ్గాలనుకునే వారు ఉదయం నిమ్మరసం నీళ్లను తాగాలి.
4. జీర్ణ సమస్యలు ఉన్నవారు ఉదయం నిమ్మరసం నీళ్లను తాగాలి. గ్యాస్, అసిడిటీ, అజీర్ణం, మలబద్దకం వంటి సమస్యలు తగ్గుతాయి.
5. నిమ్మరసం నీళ్లను ఉదయం తాగడం వల్ల మెదడు పనితీరు మెరుగు పడుతుంది. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి.
నిమ్మరసం నీళ్లను రాత్రి నిద్రకు ముందు తాగితే
1. పెద్ద పేగు శుభ్రమవుతుంది. మరుసటి రోజు విరేచనం సులభంగా అవుతుంది. మలబద్దకం ఉన్నవారికి మేలు జరుగుతుంది.
2. అధిక బరువు తగ్గవచ్చు.
3. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
4. గుండెల్లో మంటగా అనిపించడం తగ్గుతుంది.
5. శరీరంలోని వాపులు తగ్గుతాయి.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365