అధిక బరువు తగ్గించుకోవాలని కొందరు.. డయాబెటిస్ వల్ల ఇంకొందరు.. డైట్ పేరిట మరికొందరు.. సహజంగానే ప్రస్తుత తరుణంలో రాత్రి పూట చపాతీలను ఎక్కువగా తింటున్నారు. నిజమే.. రాత్రి పూట అన్నంకు బదులుగా రెండు చపాతీలను తింటే చాలు.. సరిపోతుంది.. మనకు లాభాలే కలుగుతాయి. అయితే కేవలం గోధుమపిండితోనే కాక.. అందులో కింద తెలిపిన ధాన్యాలు, గింజలకు చెందిన పిండిని కలుపుకుని.. దాంతో చపాతీలను చేసుకుని తింటే.. ఇంకా ఎక్కువ లాభాలు కలుగుతాయి. మరి అదెలాగంటే…
2 కిలోల గోధుమపిండిలో.. 100 గ్రాముల చొప్పున శనగపిండి, మొక్కజొన్న పిండి, ఓట్స్ పిండి, 50 గ్రాముల చొప్పున సజ్జ పిండి, బార్లీ, రాగులు, సోయాబీన్ పిండిలను కలిపి.. ఆ తరువాత ఏర్పడే పిండితో చపాతీలను చేసుకుని తినాలి. అయితే వీటిల్లో శనగలకు పొట్టు తీయకూడదు. వాటిని అలాగే పిండి చేసి మిగిలిన పిండిలతో కలపాలి. ఈ క్రమంలో మొత్తం మిశ్రమంతో తయారు చేసే చపాతీలను రాత్రి తినడం వల్ల మనకు ఇంకా ఎక్కువ లాభాలు కలుగుతాయి. ఆయా ధాన్యాలు, గింజల్లో ఉండే పోషకాలన్నీ మనకు లభిస్తాయి.
పైన తెలిపిన విధంగా చపాతీలను చేసుకుని తింటే.. అధికబరువు, డయాబెటిస్ తగ్గడమే కాదు.. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. ఎముకలు దృఢంగా మారుతాయి. రక్తం బాగా వృద్ధి చెందుతుంది. శరీరానికి బలం కలుగుతుంది. అలాగే జీర్ణ సమస్యలు తగ్గుతాయి..!