అధిక బరువు అనేది ప్రస్తుతం చాలా మందికి సమస్యగా మారింది. అధికంగా ఉన్న బరువును తగ్గించుకునేందుకు చాలా మంది రక రకాలుగా ప్రయత్నిస్తుంటారు. వ్యాయామం చేయడం, పౌష్టికాహారం తీసుకోవడం వంటివి చేస్తున్నారు. అయితే అన్నీ సరిగ్గానే చేసినా కొందరు చేసే కొన్ని పొరపాట్ల వల్ల బరువు తగ్గకపోగా పెరుగుతుంటారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. రోజూ తగినన్ని గంటల పాటు నిద్రించకపోయినా అధికంగా బరువు పెరుగుతారు. కొందరు అన్నీ సరిగ్గానే చేస్తారు. కానీ నిద్ర సరిగ్గా పోరు. నిద్ర సరిగ్గా పోకపోతే బరువు పెరుగుతారు. కనీసం రోజుకు 7 నుంచి 8 గంటల పాటు అయినా నిద్రించాలి. అది కూడా రాత్రి త్వరగా నిద్రించాలి. ఉదయాన్నే త్వరగా నిద్ర లేవాలి. ఆలస్యంగా నిద్ర లేచినా బరువు పెరుగుతారు. సరిగ్గా నిద్రించకపోతే శరీరంలో ఒత్తిడికి సంబంధించిన హార్మోన్లు విడుదలవుతాయి. అవి అధికంగా తినేలా చేస్తాయి. కనుక తగినంత నిద్రించాలి. నిద్ర సరిగ్గా పోతే అధిక బరువును తగ్గించుకోవడం తేలికవుతుంది.
2. కొందరు ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ చేయరు. నేరుగా మధ్యాహ్నం భోజనం చేస్తారు. ఇలా చేయడం వల్ల మెటబాలిక్ వ్యవస్థ బలహీనమవుతుంది. దీంతో అధికంగా బరువు పెరుగుతారు. కనుక ఉదయం కచ్చితంగా బ్రేక్ ఫాస్ట్ చేయాలి.
3. ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ తగినంత నీటిని తాగాలని వైద్య నిపుణులు చెబుతుంటారు. అది కరెక్టే. కానీ తగినంత నీటిని తాగకపోయినా అధికంగా బరువు పెరుగుతారు. రోజూ కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీటిని తాగాలి. దీంతో జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. ఇది బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది.
4. అధిక బరువు తగ్గే క్రమంలో కొందరు జంక్ ఫుడ్ లాగించేస్తుంటారు. కొందరు సమయం తప్పించి తింటారు. ఇలా చేయరాదు. వ్యాయామం చేస్తున్నాం కదా అని జంక్ ఫుడ్ తినరాదు. పౌష్టికాహారమే తినాలి. అలాగే సమయానికి భోజనం చేయాలి. ఆలస్యంగా భోజనం చేస్తే అది అధిక బరువు పెరిగేందుకు కారణమవుతుంది. కనుక ఈ తప్పు చేయరాదు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365