భోజనం చేసిన తరువాత కొందరు సోంపు గింజలను తింటుంటారు. దీంతో నోరు వాసన రాకుండా తాజాగా ఉంటుంది. అలాగే తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. అయితే సోంపు గింజలను నీటిలో మరిగించి ఆ నీటిని తాగడం వల్ల ఇంకా అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. సోంపు గింజల నీటిని రోజూ తాగడం వల్ల శరీరంలో ఉన్న కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నవారు ఈ నీటిని తాగితే మంచిది. దీని వల్ల గుండె సురక్షితంగా ఉంటుంది.
2. గ్యాస్, అజీర్ణం, అసిడిటీ, మలబద్దకం ఉన్నవారు రోజూ ఉదయం, సాయంత్రం రెండు సార్లు ఒక కప్పు మోతాదులో సోంపు గింజల నీటిని తాగాలి. దీంతో ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు.
3. సోంపు గింజల్లో కాల్షియం, సోడియం, ఐరన్, పొటాషియం ఉంటాయి. అందువల్ల శరీరానికి పోషణ లభిస్తుంది.
4. సోంపు గింజల నీటిని తాగడం వల్ల మెటబాలిజం మెరుగు పడుతుంది. బరువు నియంత్రణలో ఉండేందుకు ఇది సహాయ పడుతుంది.
5. సోంపు గింజల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. కనుక ఆ నీటిని తాగడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా చూసుకోవచ్చు. అలాగే శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి.
ఒక టీస్పూన్ సోంపు గింజలను తీసుకుని ఒక గ్లాస్ నీటిలో మరిగించాలి. నీరు బాగా మరిగాక వడకట్టి అందులో కొద్దిగా తేనె కలుపుకుని తాగాలి. ఈ నీటిని రోజుకు రెండు సార్లు తాగవచ్చు. దీంతో పైన తెలిపిన ప్రయోజనాలు కలుగుతాయి.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365