హెల్త్ టిప్స్

బాదం పాలు తాగితే ఎవ‌రికి ప్ర‌యోజ‌నం క‌లుగుతుందంటే..?

సాధార‌ణ పాలు తాగితే అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే. అయితే భిన్న ర‌కాల పాలు కూడా మ‌న‌కు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో బాదం పాలు కూడా ఒక‌టి. బాదం పాల‌లో అనేక పోష‌కాలు ఉంటాయి. వీటిని రోజూ తాగ‌డం వ‌ల్ల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి.

health benefits of drinking almond milk

బాదం పాల‌లో పోష‌కాలు అధికంగా, క్యాల‌రీలు త‌క్కువ‌గా ఉంటాయి. అందువ‌ల్ల బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి ఈ పాలు ఎంత‌గానో మేలు చేస్తాయ‌ని చెప్ప‌వ‌చ్చు. ఈ పాల‌లో కాల్షియం, మెగ్నిషియం, మాంగ‌నీస్‌, విట‌మిన్ కె, ఇ, ప్రోటీన్లు, జింక్‌, కాప‌ర్ త‌దిత‌ర పోషకాలు స‌మృద్ధిగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి అవ‌స‌రం. వీటి వ‌ల్ల చ‌ర్మం, శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి.

ఆవు పాలు, గేదె పాలు తాగ‌లేని వారికి బాదం పాలు ప్ర‌త్యామ్నాయం అని చెప్ప‌వ‌చ్చు. ఇవి జంతు సంబంధ‌మైన‌వి కావు క‌నుక సుల‌భంగా జీర్ణ‌మ‌వుతాయి. చిన్నారులు, వృద్ధులు కూడా బాదం పాల‌ను తాగ‌వ‌చ్చు.

మ‌న దేశంలో విట‌మిన్ డి లోపంతో అనేక మంది బాధ‌ప‌డుతున్నారు. అలాంటి వారు బాదం పాల‌ను తాగితే విట‌మిన్ డి అధికంగా ల‌భిస్తుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఎముక‌లు దృఢంగా మారుతాయి. రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. విటమిన్ డి లోపం ఉన్న‌వారు రోజూ బాదం పాల‌ను తాగాలి.

ఒక క‌ప్పు బాదం పాల‌ను తాగ‌డం వ‌ల్ల మ‌న‌కు రోజూ కావ‌ల్సిన కాల్షియంలో 45 శాతం వ‌ర‌కు ల‌భిస్తుంది. దీని వ‌ల్ల ఎముక‌లు దృఢంగా మారుతాయి. గుండె ఆరోగ్యం సుర‌క్షితంగా ఉంటుంది. నాడులు ఆరోగ్య‌వంత‌మ‌వుతాయి. ఇక డ‌యాబెటిస్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డేవారు బాదం పాల‌ను తాగ‌వ‌చ్చు. ఇందులో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. క‌నుక దీంతో ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు త్వ‌ర‌గా పెర‌గ‌వు. డ‌యాబెటిస్ నియంత్ర‌ణ‌లో ఉంటుంది. డ‌యాబెటిస్ ఉన్న‌వారికి బాదం పాలు మేలు చేస్తాయి.

బాదంపాల‌ను ఇలా త‌యారు చేసుకోండి..

ఒక గ్లాస్ నీటిలో కొన్ని బాదం ప‌ప్పును వేసి వాటిని మిక్సీలో వేసి బ్లెండ్ చేయాలి. దీంతో పాల వంటి ప‌దార్థం త‌యార‌వుతుంది. దాన్ని అవ‌స‌రం అనుకుంటే వ‌డ‌క‌ట్ట‌వ‌చ్చు. ఇలా త‌యార‌య్యే పాలు చూసేందుకు అచ్చం సాధార‌ణ పాల‌ను పోలి ఉంటాయి. అందువ‌ల్ల సుల‌భంగా వాటిని తాగ‌వ‌చ్చు. ఈ క్ర‌మంలో బాదం పాల‌ను తాగ‌డం వ‌ల్ల పైన తెలిపిన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Admin

Recent Posts