ఏదైనా అనారోగ్య సమస్య వచ్చాక దానికి చికిత్స పొందుంతుంటే సరైన ఆహారాన్ని తీసుకుంటేనే ఆ అనారోగ్యం నుంచి త్వరగా కోలుకునేందుకు అవకాశం ఉంటుంది. అన్ని పోషకాలు ఉండే ఆహారాలను తీసుకుంటేనే మనం ఏ అనారోగ్య సమస్య నుంచైనా వేగంగా కోలుకుంటాం. అయితే మలేరియాకు కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది.
మలేరియా అనేది దోమలు కుట్టడం వల్ల వస్తుంది. దీని వల్ల రక్తంలో ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గుతుంది. దీంతో నీరసం, జ్వరం, కండరాల నొప్పులు వస్తాయి. అయితే మలేరియా వచ్చిన వారు త్వరగా కోలుకోవాలంటే ఆహారం విషయంలో పలు మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. అవేమిటంటే..
1. మలేరియా వచ్చిన వారు డీహైడ్రేషన్ బారిన పడేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక వారు శరీరంలో ద్రవాలను తగ్గకుండా చూసుకోవాలి. ఇందుకు గాను నీటిని బాగా తాగాల్సి ఉంటుంది. అలాగే కొబ్బరినీళ్లను ఎక్కువగా తాగుతుండాలి. దీంతోపాటు నీరు అధికంగా ఉండే కీరదోస, నారింజ వంటివి తినాలి. వీటి వల్ల శరీరంలోని విష పదార్థాలు బయటకు పోతాయి. వ్యాధి నుంచి త్వరగా కోలుకోవచ్చు.
2. మలేరియా వచ్చిన వారిలో కండరాల క్షీణత వస్తుంది. దీంతో శక్తి లభించదు. నీరసంగా ఉంటారు. కనుక అలాంటి వారు ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. దీంతో మలేరియా నుంచి త్వరగా కోలుకునేందుకు అవకాశం ఉంటుంది. ప్రోటీన్లను తీసుకోవడం వల్ల కణాలు తమకు తాము మరమ్మత్తులు చేసుకుంటాయి. దీంతో త్వరగా కోలుకుంటారు. పప్పు దినుసులు, నట్స్, కూరగాయలు, పాలు, పాల ఉత్పత్తుల్లో ప్రోటీన్లు అధికంగా లభిస్తాయి.
3. మలేరియా వచ్చిన వారు ప్రోటీన్లను తీసుకోవడం ఎంత అవసరమో కొవ్వు ఆహారాలను తీసుకోవడం కూడా అంతే అవసరం. దీని వల్ల శరీరంలో పలు జీవక్రియలు సాఫీగా జరుగుతాయి. అయితే కొవ్వు పదార్థాలను తక్కువ మోతాదులో తీసుకోవాలి. వేపుళ్లను తినరాదు. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉండే నట్స్, గింజలను తింటుండాలి. వీటిల్లోని ఆరోగ్యకరమైన కొవ్వులు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. మలేరియా నుంచి త్వరగా కోలుకునేలా చేస్తాయి.
ఇక మలేరియా ఉన్నవారు వేపుళ్లు, కారం, మసాలాలు అధికంగా ఉంటే ఆహారాలను తినరాదు. తాజా పండ్లు, కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి. ఫైబర్ ఉండే ఆహారాలను అధికంగా తీసుకోవాలి. కాఫీ, టీ, కూల్ డ్రింక్స్ తాగరాదు. ఇలా ఆహారపు నియమాలను పాటించడం వల్ల మలేరియా నుంచి త్వరగా కోలుకోవచ్చు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365