దవనం మొక్క మంచి ఔషధ ప్రయోజనాలను కల్పిస్తుంది. సాధారణంగా దీనిని హిందువులు కొన్ని మతపర వేడుకలలో వాడుకోవటమే కాక, ఇండియన్ మెడిసిన్ అయిన ఆయుర్వేదంలోను, యునాని వైద్యంలోను దవనానికి ఒక ప్రత్యేక స్ధానముంది. దవనం నూనె వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో పరిశీలిద్దాం. దవనం నూనెను సువాసన కొరకు వాడతారు. ఈ నూనె వాసన ఒత్తిడిని, ఆందోళనను తగ్గిస్తుంది.
శరీరంపై వచ్చే దద్దుర్లు, పుండ్లు మొదలైనవాటిని దవనం నూనె తగ్గిస్తుంది. మహిళలు తమ కాన్పు తర్వాత పొట్టపై వచ్చే స్ట్రెచ్ మార్కులను పొగొట్టుకోటానికి దవనం నూనెను పొట్ట భాగంపై రుద్దుతారు. రుతుక్రమం సరిగా రావటానికి, తిన్న పదార్ధాలు జీర్ణం కావటానికి కూడా ఈ రకమైన మర్దన చేస్తారు.
దవనం నూనె శరీరంలో బ్లడ్ షుగర్ స్ధాయిని తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. దీనిని షుగర్ వ్యాధి వున్న వారికిచ్చే మందులలో కలుపుతారు. దవనం నూనెను కండరాల నొప్పులకు సడలింపు కు మంచి ఔషధంగా వాడవచ్చు. నూనెను మర్దన చేస్తే అలసటను దూరం చేస్తుంది. వేడి నీటిలో కొద్దిపాటి నూనె చుక్కలను వేసి ఆవిరి పడితే లంగ్స్ శుభ్రపడి శ్వాస సంబంధిత వ్యాధులు తగ్గుతాయి.