బెండకాయలతో చేసిన వంటకాలు తినడానికి చాలామంది ఇష్టపడతారు. బెండకాయల్ని ఫ్రై, సాంబారు, పులుసు, కర్రీల్లో ఎక్కువగా వాడతారు. అయితే బెండకాయలు ఆరోగ్యానికి ఎంతమేలు చేస్తాయనేది మీకు తెలుసా..? బెండకాయల్లో మ్యూకస్ వంటి పదార్ధం ఉంటుంది. ఇది గ్యాస్ట్రిక్ సమస్యలకు, ఎసిడిటీకి చక్కని పరిష్కారం.
డయాబెటీస్ తో బాధపడేవారు ఎక్కువగా బెండకాయలతో చేసిన వంటకాలు తినడం మంచిది. బెండకాయల్ని నిలువుగా చీల్చి .. రెండు సగాల్ని గ్లాసుడు నీటిలో రాత్రంతా ఉంచి మర్నాడు ముక్కలు తీసివేసి .. ఆనీటిని తాగితే సుగర్ కంట్రోల్ లో ఉంటుంది. బెండకాయల్లో ఎక్కువగా ఉండే ఎ, బి, సి విటమిన్లు, పలు పోషక పదార్థాలు, అయోడిన్ అనేక రకాల అనారోగ్యాలకు చెక్ పెడతాయి.
బెండకాయల్లో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. ముఖ్యంగా తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. సో వీలైనంతగా బెండకాయల్ని మీ ఆహారపదార్ధాల్లో చేర్చుకోండి.. ఆరోగ్యంగా ఉండండి.