Milk With Ghee : ఆయుర్వేదంలో అనేక చిట్కాల గురించి ప్రస్తావించారు. అవన్నీ మనల్ని ఆరోగ్యంగా ఉంచేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ క్రమంలోనే అలాంటి చిట్కాల్లో ఒకదాని గురించే ఇప్పుడు చెప్పబోతున్నాం. అదే.. పాలలో నెయ్యిని కలిపి తీసుకోవడం. రాత్రి పూట ఒక గ్లాస్ పాలలో ఒక టీస్పూన్ దేశవాళీ నెయ్యిని కలిపి తాగితే ఆయుర్వేద ప్రకారం ఎన్నో లాభాలు కలుగుతాయి. ఇలా తాగడం వల్ల పురుషులకు ఎక్కువ మేలు జరుగుతుంది. ఇక ఈ మిశ్రమంతో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1. రాత్రి పూట ఒక గ్లాస్ పాలలో కాస్త దేశవాళీ నెయ్యిని కలిపి తాగడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. యవ్వనంగా కనిపిస్తారు. వృద్ధాప్య ఛాయలు కనిపించవు. అలాగే చర్మంపై ఉండే మచ్చలు పోయి చర్మం మృదువుగా మారుతుంది. తేమగా ఉంటుంది. పొడి చర్మం ఉన్నవారికి ఇది ఎంతగానో మేలు చేస్తుంది.
2. రాత్రి పూట చాలా మంది నిద్ర పట్టక ఆలస్యంగా నిద్రిస్తుంటారు. దీనికి ఒత్తిడే ప్రధాన కారణం అని చెప్పవచ్చు. అయితే రాత్రి పూట పాలలో నెయ్యిని కలిపి తాగితే ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక సమస్యలు తగ్గుతాయి. దీంతో మనస్సు ప్రశాంతంగా మారుతుంది. నిద్ర చక్కగా పడుతుంది. పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటారు. నిద్రలేమి సమస్య నుంచి బయట పడవచ్చు.
3. పాలలో నెయ్యి కలిపి తాగడం వల్ల పురుషుల్లో శృంగార సామర్థ్యం పెరుగుతుంది. దీంతోపాటు వీర్యం అధికంగా ఉత్పత్తి అవుతుంది. ఇది సంతానం కలిగే అవకాశాలను మెరుగు పరుస్తుంది.
4. పాలు, నెయ్యి మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల శరీర మెటబాలిజం పెరుగుతుంది. ఇది జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. దీంతో కొవ్వు వేగంగా కరుగుతుంది. ఫలితంగా బరువు త్వరగా తగ్గుతారు.
5. గర్భిణీలు ఈ మిశ్రమాన్ని తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. కడుపులో ఉండే బిడ్డలో ఎదుగుదల లోపం రాకుండా జన్మిస్తుంది. బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే పాలిచ్చే తల్లులకు కూడా మేలు జరుగుతుంది. వారిలో పాలు బాగా ఉత్పత్తి అవుతాయి. ఇలా పాలు, నెయ్యి మిశ్రమం అందరికీ ఎంతో మేలు చేస్తుంది. అయితే గుండె జబ్బులు ఉన్నవారు, మధుమేహం సమస్యతో బాధపడుతున్నవారు డాక్టర్ సలహా మేరకు దీన్ని తీసుకోవాలి.