Mint For Indigestion : చాలామంది, రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అనారోగ్య సమస్యలు ఏమి కలగకుండా ఉండాలంటే, సరైన ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా, అజీర్తి సమస్యలతో బాధపడుతున్నారు. ఎక్కువ జంక్ ఫుడ్ వంటి వాటిని తీసుకుంటున్నారు. దీంతో గ్యాస్, అజీర్తి మొదలైన సమస్యలు వస్తున్నాయి. కాబట్టి, జాగ్రత్తగా ఉండాలి. మారిన జీవన శైలి, తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. సరైన సమయంలో భోజనం చేయడం కూడా అవసరం. గ్యాస్, ఎసిడిటీ, గుండె లో మంట వంటి సమస్యలు ఈ రోజుల్లో ఎక్కువగా వస్తున్నాయి.
దాంతో చాలా మంది మందులుని వాడుతున్నారు. అలా కాకుండా, మనం ఇంటి చిట్కాలతో ఈ సమస్య నుండి బయటపడవచ్చు. గుండెలో మంట, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు ఉన్నప్పుడు ఒక లీటర్ వరకు నీళ్లు తాగండి. అలా తాగడం వలన జీర్ణాశయం లో అధికంగా ఉత్పత్తి అయ్యే గ్యాస్ తగ్గి, సమస్య నుండి ఉపశమనం మీకు లభిస్తుంది.
గ్యాస్ సమస్య ఉన్నప్పుడు, పడుకోకుండా కూర్చుంటే మంచిది. కూర్చోవడం వలన గ్యాస్ పైకి రాకుండా ఉంటుంది. పడుకుంటే మాత్రం గ్యాస్ పైకి వస్తుంది. దీంతో సమస్య బాగా ఎక్కువై పోతుంది. గ్యాస్ సమస్య ఉన్నప్పుడు, గుండె లో మంటగా అనిపించినప్పుడు, అరటి పండు కానీ ఆపిల్ ని కానీ తింటే మంచిది.
ఒక గ్లాసు నీళ్లలో, ఒక స్పూన్ పుదీనా రసం కలుపుకొని తాగితే గ్యాస్, ఎసిడిటీ, గుండెలో మంట తగ్గుతాయి. మజ్జిగ తాగితే కూడా ఉపశమనం కలుగుతుంది. ఇలా, అజీర్తి సమస్యలనుండి ఈజీగా బయటపడొచ్చు. మందుల్ని తీసుకోకర్లేదు. ఇలా చిన్న చిట్కాలని పాటించినట్లయితే, వెంటనే ఉపశమనం లభిస్తుంది. ఏ సమస్య కూడా ఉండదు. వెంటనే తగ్గిపోతుంది.