హెల్త్ టిప్స్

వ‌ర్క్ ఫ్ర‌మ్ హోంలో ఎక్కువ సేపు ప‌నిచేయ‌లేక‌పోతున్నారా ? ఈ సూచ‌న‌లు పాటిస్తే ఎక్కువ సేపు ప‌నిచేయ‌వ‌చ్చు..!

క‌రోనా నేప‌థ్యంలో ప్ర‌స్తుతం చాలా మంది ఇళ్ల నుంచే ప‌నిచేస్తున్నారు. గ‌త ఏడాదిన్న‌ర నుంచి ఉద్యోగులు నిరంత‌రాయంగా వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేస్తున్నారు. అయితే ఆఫీసుల్లో ఉద్యోగుల‌కు కావ‌ల్సిన అన్ని స‌దుపాయాలు ఉంటాయి. దీనికి తోడు స‌హోద్యోగులు ప‌నిచేస్తుంటారు. క‌నుక ఒక‌రిని చూసి ఒక‌రు పోటీ ప‌డుతూ ప‌నిచేస్తారు. కానీ వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ వేరు. చాలా ర‌కాలుగా అవాంత‌రాలు వ‌స్తుంటాయి. వాటిని ఎదుర్కొంటూ ప‌నిచేయాలి. మ‌రోవైపు ఆఫీసులో ఉన్న‌ట్లు స‌దుపాయాలు ఉండ‌వు. దీంతో స‌హ‌జంగానే ప‌ని త‌క్కువ‌గా చేస్తారు. అయితే ఈ సూచ‌న‌లు పాటిస్తే వ‌ర్క్ ఫ్ర‌మ్ హోం చేసేవారు కూడా ప‌ని ఎక్కువ‌గా చేయ‌వ‌చ్చు. దీంతో ఉత్పాద‌క‌త పెరుగుతుంది. కెరీర్‌లో రాణిస్తారు. మ‌రి ఆ సూచ‌న‌లు ఏమిటంటే..

not working enough in work from home follow these tips to do more work

1. వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్‌లో చాలా మంది స‌రిగ్గా ప‌నిచేయ‌క‌పోవ‌డానికి కార‌ణం.. ఇంట్లో ఫ‌ర్నిచ‌ర్ స‌రిగ్గా ఉండ‌క‌పోవ‌డ‌మే. కంప్యూట‌ర్ల ఎదుట కూర్చుని ప‌నిచేస్తారు. కాబ‌ట్టి కంప్యూట‌ర్లు పెట్టుకునేందుకు క‌చ్చితంగా అనువైన టేబుల్స్ ఉండాలి. అలాగే కూర్చునేందుకు సాధార‌ణ కుర్చీలు ప‌నికిరావు. ఆఫీసుల్లో మాదిరి కుర్చీల‌ను తీసుకోవాలి. దీంతో సౌక‌ర్య‌వంతంగా ఉంటుంది. ప‌ని ఎక్కువ‌గా చేస్తారు. పైగా శ‌రీరంపై ఒత్తిడి ప‌డ‌కుండా చూసుకోవ‌చ్చు.

2. ఆఫీస్‌లో అయితే కొన్ని నిర్దిష్ట‌మైన‌న్ని గంట‌ల పాటు మాత్ర‌మే ప‌ని చేస్తారు. త‌రువాత ఇంటికి వ‌చ్చి రిలాక్స్ అవుతాయి. ఇంట్లో ప‌ని చేసేదేం ఉండ‌దు. క‌నుక ప్ర‌శాంత‌త ల‌భిస్తుంది. అదే వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేస్తే నిరంత‌రాయంగా ప‌ని ఉంటుంది. విరామం అనేది ఉండ‌దు. క‌నుక మ‌ధ్య మ‌ధ్య‌లో ప‌నికి కొంత విరామం ఇవ్వాలి. అప్పుడ‌ప్పుడు 10-15 నిమిషాల బ్రేక్ తీసుకోవాలి. ఆ ఖాళీ స‌మ‌యంలో కార్డులు, బోర్డ్ గేమ్స్, పజిల్ గేమ్స్ వంటి ఇండోర్ గేమ్‌లను ఆడాలి. దీంతో ఒత్తిడి త‌గ్గి రిలాక్స్ అవుతారు. మెద‌డు చురుగ్గా ప‌నిచేస్తుంది. మ‌ళ్లీ ప‌ని ఎక్కువ‌గా చేయ‌వ‌చ్చు. లేదంటే ఒత్తిడి పెరిగిపోతుంది. ప‌నిచేసేందుకు ఆస‌క్తి ఉండ‌దు.

3. కంప్యూట‌ర్ల ఎదుట ఎక్కువ సేపు కూర్చుంటారు క‌నుక వాటి మీద ఇంట్లోని లైట్ల‌కు చెందిన లైటింగ్ ప‌డేలా చూసుకోవాలి. దీంతో క‌ళ్ల‌పై ప‌డే ఒత్తిడి త‌గ్గుతుంది. కంటి స‌మ‌స్య‌లు రావు. ఎక్కువ సేపు ప‌నిచేయ‌వ‌చ్చు.

4. ఇంట్లో మీరు ప‌నిచేసేందుకు ప్ర‌త్యేకంగా ఒక గ‌దిని లేదా ఒక చోటును కేటాయించుకోండి. ఆ ప్ర‌దేశం వ‌ల్ల అలంక‌ర‌ణ వ‌స్తువులు లేదా ఇండోర్ ప్లాంట్ల‌ను ఏర్పాటు చేయండి. దీంతో మ‌న‌స్సు రిలాక్స్ అవుతుంది. ఎక్కువ సేపు ప‌నిచేయ‌వ‌చ్చు.

5. బాదంప‌ప్పు, పిస్తా, గుమ్మ‌డికాయ విత్త‌నాలు, పొద్దు తిరుగుడు విత్త‌నాలు, వాల్ న‌ట్స్, నువ్వులు, అవిసె గింజ‌లు, తాజా పండ్ల‌ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం వ‌ల్ల మెద‌డ‌పై ప‌డే ఒత్తిడి త‌గ్గుతుంది. తాజాద‌న‌పు అనుభూతి క‌లుగుతుంది. దీంతో ఎక్కువ సేపు ప‌నిచేయ‌వ‌చ్చు. ఇలా వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేసిన‌ప్ప‌టికీ ఎక్కువ సేపు ప‌నిచేస్తూ ఉత్పాద‌క‌త‌ను పెంచుకోవ‌చ్చు. దీంతో కెరీర్‌లో ఇబ్బందులు రాకుండా ఉంటాయి.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Share
Admin

Recent Posts