Oil To Hair : మన పెద్దలు జుట్టుకు తప్పకుండా నూనె రాసుకోవాలని చెబుతూ ఉంటారు. జుట్టుకు నూనె రాసుకోవడం వల్ల జుట్టు పెరుగుతుందని, జుట్టు దెబ్బతినకుండా ఉంటుందని, జుట్టు రాలడం, బట్టతల వంటి సమస్యలు రాకుండా ఉంటాయని చెబుతూ ఉంటారు. చక్కగా నూనె రాసి జడ వేసుకుంటే ఎటువంటి జుట్టు సమస్యలు రాకుండా ఉంటాయని చెప్పడం మనం ఇప్పటికి వింటూనే ఉంటాం. కానీ నేటి తరుణంలో చాలా మంది జుట్టుకు నూనె రాసుకోవడమే మానేసారు. జుట్టుకు నూనె రాసుకోకపోవడం వల్లే జుట్టు సమస్యలు వస్తున్నాయని భావించే వారు కూడా మనలో చాలా మంది ఉన్నారు. అయితే నిజంగా నూనె రాసుకుంటే జుట్టు పెరుగుతుందా.. జుట్టు దెబ్బతినకుండా ఉంటుందా…. అసలు దీని గురించి నిపుణులు ఏమంటున్నారు.. ఇప్పుడు తెలుసుకుందాం.
నూనె రాసుకోవడం వల్ల జుట్టు పెరగదని అలాగే నూనె రాసుకోవడం వల్ల బట్టతల, జుట్టు చిట్లడం, జుట్టు విరగడం వంటి సమస్యలు రాకుండా పోవని నూనె రాయనంతా మాత్రాన జుట్టు దెబ్బతినదని వారు చెబుతున్నారు. జుట్టు పెరుగుదలకు నూనెకు ఎటువంటి సంబంధం ఉండదని వారు చెబుతున్నారు. అయితే జుట్టుకు నూనె రాసుకోవడం వల్ల కొన్ని ప్రయోజనాలను మాత్రం మనం పొందవచ్చని వారు చెబుతున్నారు. జుట్టుకు నూనె రాసుకోవడం వల్ల కేవలం జుట్టు మృదువుగా మాత్రమే ఉంటుందని, జుట్టు ముక్కలు ముక్కలుగా పగలకుండా ఉంటుందని వారు చెబుతున్నారు. ఎండ వల్ల జుట్టు గట్టిగా మారుతుంది. ఇలా గట్టిగా మారిన జుట్టు పగలడం, విరగడం జరుగుతుంది. నూనె రాసుకోవడం వల్ల జుట్టు మెత్తగా, విరగకుండా ఉంటుంది.
అలాగే నూనె రాసుకోవడం వల్ల జుట్టు ఎర్రగా మారకుండా ఎప్పుడూ నల్లగా ఉంటుంది. మార్కెట్ లో మనకు ఎన్నో రకాల హెయిర్ ఆయిల్స్ ను చూపిస్తూ ఉంటారు. వారి నూనెలను వాడితే జుట్టు పొడవుగా పెరుగుతుందని ప్రకటనలు ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉంటాము. కానీ ఇందులో ఎటువంటి వాస్తవం లేదని నూనె రాసినంత మాత్రాన జుట్టు పెరగదని నిపుణులు చెబుతున్నారు. జుట్టు పొడవుగా పెరగాలంటే జుట్టు కుదుళ్లకు రక్తప్రసరణ సక్రమంగా జరిగేలా చూసుకోవాలి. రక్తహీనత వంటి సమస్యలు లేకుండా చూసుకోవాలి. అలాగే ప్రోటీన్ లోపం రాకుండా చూసుకోవాలి. ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.
అదే విధంగా నీటిని ఎక్కువగా తాగాలి. నీటిని తాగడం వల్ల జుట్టు విరిగిపోకుండా ఉంటుంది. అలాగే వారానికి ఒకసారి మాత్రమే షాంపుతో తలస్నానం చేయాలి. మిగిలిన రోజులు కేవలం నీటితోనే తలస్నానం చేయాలి. షాంపులల్లో రసాయనాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రసాయనాల కారణంగా జుట్టు దెబ్బతినే అవకాశం ఉంది. కనుక షాంపులతో తలస్నానం చేయడం తగ్గించాలి. జుట్టు పెరగాలనుకునే వారు ఈ చిట్కాలను పాటించాలని అంతేకాని నూనె రాసుకోవడం వల్ల జుట్టు పెరగదని నిపుణులు తెలియజేస్తున్నారు.