హెల్త్ టిప్స్

వ‌య‌స్సు పైబ‌డిన వారు ఈ ఆహారాల‌ను ఎక్కువ‌గా తీసుకుంటున్నారా ? అయితే ఎముక‌లు బ‌ల‌హీనంగా మారిపోతాయి.. జాగ్ర‌త్త‌..!

వ‌య‌స్సు మీద ప‌డుతున్న కొద్దీ ఎవ‌రికైనా స‌రే ఎముక‌లు బ‌ల‌హీనంగా మారుతాయి. అది స‌హ‌జ‌మే. అయితే కొన్ని ర‌కాల ఆహారాల‌ను తిన‌డం వ‌ల్ల ఎముక‌లు త్వ‌ర‌గా బ‌ల‌హీనంగా మారుతాయి. ఎముక‌ల లోప‌ల గుల్ల‌గా మారుతాయి. దీంతో ఎముక‌లు పెళుసుగా మారి విరిగిపోయేందుకు అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. అందువ‌ల్ల రోజూ తీసుకునే ఆహారాల‌పై దృష్టి పెట్టాలి. ఎముక‌ల ఆరోగ్యాన్ని ర‌క్షించే ఆహారాల‌ను తీసుకోవాలి. అయితే కింద తెలిపిన ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ఎముక‌లు బ‌ల‌హీనంగా మారిపోతాయి. మ‌రి ఆ ఆహారాలు ఏమిటంటే..

1. కూల్ డ్రింక్స్‌, ఇత‌ర శీత‌ల పానీయాల‌ను ఎక్కువ‌గా తాగేవారికి ఎముక‌లు త్వ‌ర‌గా బ‌ల‌హీనంగా మారుతాయి. వాటిల్లో ఉండే ఫాస్పారిక్ యాసిడ్ ఎముక‌ల‌ను గుల్ల‌గా మారుస్తుంది. దీంతో అలాంటి వారి ఎముక‌లు బ‌ల‌హీనంగా మారి వారికి ఆస్టియో పోరోసిస్ వ‌చ్చేందుకు అవ‌కాశాలు ఉంటాయి. ఆస్టియో పోరోసిస్ అంటే ఎముక‌ల్లో పూర్తిగా సాంద్ర‌త త‌గ్గుతుంది. గుల్ల‌గా మారిపోతాయి. ఊరికే విరిగిపోతాయి. ఈ వ్యాధి వ‌స్తే ప్ర‌మాదం. క‌నుక కూల్ డ్రింక్స్‌ను తాగ‌డం మానేయాలి.

2. చ‌క్కెర‌తోపాటు రీఫైన్ చేయ‌బ‌డిన కార్బొహైడ్రేట్ల‌ను ఎక్కువ‌గా తింటే ఆస్టియోపోరోసిస్ వ‌స్తుంది. చిప్స్‌, బ్రెడ్‌, వైట్ రైస్‌, కార్న్ ఫ్లోర్‌లను రీఫైన్ చేయ‌బ‌డిన కార్బొహైడ్రేట్లు అని చెప్ప‌వ‌చ్చు. వీటిని తిన‌డం వ‌ల్ల కూడా ఎముక‌లు బ‌ల‌హీనంగా మారుతాయి. క‌నుక వీటిని తిన‌డం మానేయాలి. బ్రౌన్ రైస్, తృణ ధాన్యాలు వంటి వాటిని తీసుకోవాలి. దీంతో ఎముక‌లు దృఢంగా ఉంటాయి.

older people who take these foods may get osteoporosis older people who take these foods may get osteoporosis

3. బ‌య‌ట హోట‌ల్స్ లో గ్రిల్ చేయ‌బ‌డిన, కాల్చ‌బ‌డిన ఆహారాలు మ‌న‌కు ల‌భిస్తాయి. వీటిని యుక్త వ‌య‌స్సులో ఉండేవారు తిన‌వ‌చ్చు. కానీ వ‌య‌స్సు పైబ‌డిన వారు తింటే ఎముక‌లు బ‌ల‌హీనంగా మారుతాయి. క‌నుక వీటికి దూరంగా ఉండాలి.

4. రోజూ ఆహారాల్లో ఉప్పు లేక‌పోతే మ‌నం వాటిని తిన‌లేం. అయితే ఉప్పు మోతాదుకు మించినా ఎముక‌లు బ‌ల‌హీనంగా మారి ఆస్టియోపోరోసిస్ వ‌స్తుంది. కాబ‌ట్టి రోజూ అధిక మోతాదులో ఉప్పును తిన‌రాదు.

5. క్రిమి సంహార‌క మందుల‌ను వాడి పండించిన కూర‌గాయ‌లు, పండ్ల‌ను తీసుకుంటున్నా ఆస్టియోపోరోసిస్ వ‌స్తుంద‌ని సైంటిస్టులు చేప‌ట్టిన అధ్య‌య‌నాల్లో వెల్ల‌డైంది. అందువ‌ల్ల సేంద్రీయ ప‌ద్ధ‌తిలో పండించిన వాటిని తినాలి. దీంతో ఎముక‌ల‌ను ఆరోగ్యంగా ఉంచుకోవ‌చ్చు.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Admin

Recent Posts